Telugu Global
Cinema & Entertainment

కమల్ కలల ప్రాజెక్టు ఇక లేనట్టే....

ఒకటి కాదు… రెండు కాదు… కమల్ హాసన్ కలల ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. ప్రతిసారి దాన్ని సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తాడు. కానీ అది సాధ్యంకాక మళ్లీ మరో సినిమాతో బిజీ అయిపోతుంటాడు కమల్. దాదాపు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అప్పుడెప్పుడో మురుదనాయకన్ అనే సినిమాను గ్రాండ్ గా ప్రారంభించాడు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటివరకు సెట్స్ పైకి రానేలేదు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి విశ్వరూపం-2 కూడా చేరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. స్వయంగా కమల్ […]

కమల్ కలల ప్రాజెక్టు ఇక లేనట్టే....
X

ఒకటి కాదు… రెండు కాదు… కమల్ హాసన్ కలల ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. ప్రతిసారి దాన్ని సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తాడు. కానీ అది సాధ్యంకాక మళ్లీ మరో సినిమాతో బిజీ అయిపోతుంటాడు కమల్. దాదాపు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అప్పుడెప్పుడో మురుదనాయకన్ అనే సినిమాను గ్రాండ్ గా ప్రారంభించాడు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటివరకు సెట్స్ పైకి రానేలేదు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి విశ్వరూపం-2 కూడా చేరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. స్వయంగా కమల్ మాటలే ఈ రూమర్ కు బలం ఇస్తోంది.

కమల్ కలల ప్రాజెక్టుల్లో ఒకటి విశ్వరూపం. ఎలాగోలా విశ్వరూపం పార్ట్-1ను అయితే విడుదల చేయగలిగాడు. భారీ సెట్స్, అంతే భారీ వివాదాలతో విశ్వరూపం సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ సినిమా పార్ట్-2 మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. రెండో భాగానికి సంబంధించి ఇప్పటికే 30శాతం ఎడిటెడ్ వెర్షన్ కమల్ వద్ద సిద్ధంగా ఉంది. కానీ మిగతా పార్ట్ షూట్ చేయడానికి డబ్బు లేదు. భారీ సెట్స్ కావాలి కాబట్టి బడా నిర్మాత కావాలి. కానీ ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో విశ్వరూపం-2 ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవంటున్నాడు కమల్ హాసన్.

First Published:  2 Sep 2016 10:28 PM GMT
Next Story