Telugu Global
Cinema & Entertainment

ఇది ఫస్ట్ లుక్ అయితే బాగుండేది...

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఖైదీనంబర్-150 ఫస్ట్ లుక్ తోపాటు.. ధృవ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధృవ కంటే ఖైదీ నంబర్-150 ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లే ఎక్కువగా అందర్నీ ఎట్రాక్ట్ చేశాయి. సరే ఈ సంగతి పక్కనపెడితే.. ధృవ ఫస్ట్ లుక్ లో భాగంగా విడుదల చేసిన స్టిల్ కంటే మరో మంచి స్టిల్ ను తాజాగా విడుదల చేశారు. రామ్ చరణ్ సింపుల్ గా నిల్చున్న ఓ […]

ఇది ఫస్ట్ లుక్ అయితే బాగుండేది...
X

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఖైదీనంబర్-150 ఫస్ట్ లుక్ తోపాటు.. ధృవ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధృవ కంటే ఖైదీ నంబర్-150 ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లే ఎక్కువగా అందర్నీ ఎట్రాక్ట్ చేశాయి. సరే ఈ సంగతి పక్కనపెడితే.. ధృవ ఫస్ట్ లుక్ లో భాగంగా విడుదల చేసిన స్టిల్ కంటే మరో మంచి స్టిల్ ను తాజాగా విడుదల చేశారు. రామ్ చరణ్ సింపుల్ గా నిల్చున్న ఓ ఫొటోను ఈమధ్య మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్ చూసిన ప్రతి ఒక్కరికి మదిలో మెదిలిన మొదటి డౌట్ ఒకటే. అరె.. ఈ స్టిల్ ఏదో ఫస్ట్ లుక్ కింద విడుదల చేస్తే బాగుండేదే అని అంతా అనుకున్నారు. ఆ ఫొటో అంత బాగుంది మరి. కండలు తిరిగిన కత్తిలాంటి బాడీతో, మ్యాచో లుక్ తో రామ్ చరణ్ అలా క్యాజువల్ గా నిల్చున్న స్టిల్ ను చూసి మెగాఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ మీసకట్టు, కండలు చూసిన జనాలు కచ్చితంగా ఇది మాస్ సినిమా అని ఫిక్స్ అయిపోయారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దసరా కానుకగా ధృవ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

Druva movie poster

First Published:  31 Aug 2016 1:22 AM GMT
Next Story