Telugu Global
Cinema & Entertainment

వినాయక చవితికే చెర్రీ సందడి

ప్రస్తుతం రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో హిట్టయిన థని ఒరువన్ అనే సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా ఇటీవలే విడుదల చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ధృవ టైటిల్ ను అధికారికంగా ప్రకటించడంతో పాటు ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా రాబోతోంది. తాజా సమాచారం […]

వినాయక చవితికే చెర్రీ సందడి
X

ప్రస్తుతం రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో హిట్టయిన థని ఒరువన్ అనే సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా ఇటీవలే విడుదల చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ధృవ టైటిల్ ను అధికారికంగా ప్రకటించడంతో పాటు ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం…. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న ధృవ టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఎడిటింగ్ కు సంబంధించి ఓ ప్రత్యేకమైన టీం… టీజర్ పై వర్క్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వినాయక చవితి రోజున టీజర్ విడుదల అవుతుంది. ఆ వెంటనే సెప్టెంబర్ నెలాఖరుకు ఆడియో విడుదల చేసి, అక్టోబర్ లో దసరా కానుకగా ధృవను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ ఎప్పుడు విడుదలకానుందనే అంశంపై త్వరలోేన అధికారికంగా ఓ ప్రకటన రాబోతోంది.

First Published:  31 Aug 2016 6:48 AM GMT
Next Story