Telugu Global
NEWS

పాముల‌ప‌ర్తిపై రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ఆరోప‌ణ చేశాడు. పాముల‌ప‌ర్తి రిజ‌ర్వాయ‌రు సామ‌ర్థ్యం త‌గ్గింపు వెన‌క కేసీఆర్ హ‌స్త‌ముంద‌న్న‌ది దీని సారాంశం. రేవంత్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రాణ‌హిత‌- కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా.. మెద‌క్ జిల్లా గ‌జ్వేల్ ప‌రిధిలోని పాముల‌ప‌ర్తి వ‌ద్ద ఓ రిజ‌ర్వాయ‌ర్ నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తొలుత దీని సామ‌ర్థ్యాన్ని ఒక‌ టీఎంసీగా నిర్ణ‌యించారు. ఆ మేర‌కు డీపీఆర్ కూడా త‌యారు చేశారు. త‌రువాత 21 టీఎంసీల‌కు పెంచుతూ […]

పాముల‌ప‌ర్తిపై రేవంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
X
ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ఆరోప‌ణ చేశాడు. పాముల‌ప‌ర్తి రిజ‌ర్వాయ‌రు సామ‌ర్థ్యం త‌గ్గింపు వెన‌క కేసీఆర్ హ‌స్త‌ముంద‌న్న‌ది దీని సారాంశం. రేవంత్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రాణ‌హిత‌- కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా.. మెద‌క్ జిల్లా గ‌జ్వేల్ ప‌రిధిలోని పాముల‌ప‌ర్తి వ‌ద్ద ఓ రిజ‌ర్వాయ‌ర్ నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తొలుత దీని సామ‌ర్థ్యాన్ని ఒక‌ టీఎంసీగా నిర్ణ‌యించారు. ఆ మేర‌కు డీపీఆర్ కూడా త‌యారు చేశారు. త‌రువాత 21 టీఎంసీల‌కు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు ప‌నులు కూడా ప్రారంభించారు. ఉన్న‌ట్లుండి ఈ రిజ‌ర్వాయ‌రు సామ‌ర్థ్యాన్ని 7 టీఎంసీల‌కు కుదించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేర‌కు ఫైలు కూడా సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలిపారు.
ఈ విష‌యంలో త‌న ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని తేలితే.. త‌న‌ను జైల్లో పెట్టండి అని కూడా రేవంత్ స‌వాలు విసిరారు. దీని వెన‌క అవినీతి, కుట్ర దాగి ఉన్నాయ‌న్నారు. ప్రాజెక్టు సామ‌ర్థ్యం 21 టీఎంసీలైతే ముంపు ప్రాంతం అధికంగా ఉంటుంది. సామ‌ర్ధ్యం త‌గ్గిస్తే.. ముంపు భూములు కూడా త‌గ్గిపోతాయి. కేసీఆర్ త‌న‌ స‌న్నిహితుల భూములను ముంపుబారిన ప‌డ‌కుండా ప్రాజెక్టు సామ‌ర్ధ్యాన్ని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించాడు. దీన్ని అవినీతి అన‌క‌పోతే మ‌రేం అంటారని ప్ర‌శ్నించారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్‌లో 14 గ్రామాలు మునిగిపోతున్నాయ‌ని ఆ ఊళ్ల ప్ర‌జ‌లు ఆరునెల‌లుగా ఆందోళ‌న చేస్తున్నా దాని సామ‌ర్ధ్యం ఎందుకు త‌గ్గించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తాను చెబుతున్న‌ది అవాస్త‌వ‌మైతే.. ఈ విష‌యంపై నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్ రావు స్పందించాల‌ని స‌వాలు విసిరారు.
First Published:  28 Aug 2016 11:32 PM GMT
Next Story