Telugu Global
Cinema & Entertainment

రికార్డుస్థాయిలో ప్రీమియర్ షోలు..

జనతా గ్యారేజ్ కు సంబంధించి ఇప్పటికే ప్రింట్స్ అన్నీ డిశ్పాచ్ అయిపోయాయి. ఏపీ, నైజాం లాంటి ఏరియాస్ తో పాటు ఓవర్సీస్ కు కూడా ప్రింట్స్ పంపించేశారు. సకాలంలోనే అన్ని పనులు పూర్తయిపోయాయి. దీంతో రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఓవర్సీస్ లో కూడా జనతా గ్యారేజ్ ప్రీమియర్స్ కు డిమాండ్ పెరిగింది.  తారక్ నటించిన టెంపర్ సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఆ […]

రికార్డుస్థాయిలో ప్రీమియర్ షోలు..
X
జనతా గ్యారేజ్ కు సంబంధించి ఇప్పటికే ప్రింట్స్ అన్నీ డిశ్పాచ్ అయిపోయాయి. ఏపీ, నైజాం లాంటి ఏరియాస్ తో పాటు ఓవర్సీస్ కు కూడా ప్రింట్స్ పంపించేశారు. సకాలంలోనే అన్ని పనులు పూర్తయిపోయాయి. దీంతో రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఓవర్సీస్ లో కూడా జనతా గ్యారేజ్ ప్రీమియర్స్ కు డిమాండ్ పెరిగింది.
తారక్ నటించిన టెంపర్ సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా అయితే ఏకంగా 2.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో జనతా గ్యారేజ్ పై ఓవర్సీస్ లో అంచనాలు పెరిగాయి. దీనికి తోడు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. కొన్ని వెబ్ సైట్స్ అయితే ఓవర్సీస్ టిక్కెట్లపై 25శాతం రాయితీ ప్రకటిస్తూ, పబ్లిక్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
First Published:  29 Aug 2016 3:30 AM GMT
Next Story