Telugu Global
Cinema & Entertainment

మొన్న విడాకులు... నేడు కలిసి సినిమా...

వ్యక్తిగతం, వృత్తిగతం వేర్వేరుగానే ఉంటాయి. వ్యక్తిగత విషయాల్ని పనిలొకి తీసుకురావడం మంచిది కాదంటారు చాలామంది. ప్రస్తుతం దర్శకుడు విజయ్, హీరోయిన్ అమలాపాల్ మధ్య ఇదే వ్యవహారం సాగుతోంది. సరిగ్గా నెల రోజుల కిందట అధికారికంగా విడాకులు  తీసుకున్న ఈ జంట ఇప్పుడు కలిసి సినిమా చేయబోతోంది. మరి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారా లేదా ఇద్దర్లోంచి ఒకరు తప్పుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. గతంలో హీరో విజయ్, దర్శకుడు విజయ్, హీరోయిన్ అమలాపాల్ కాంబినేషన్ లో సినిమా […]

మొన్న విడాకులు... నేడు కలిసి సినిమా...
X

వ్యక్తిగతం, వృత్తిగతం వేర్వేరుగానే ఉంటాయి. వ్యక్తిగత విషయాల్ని పనిలొకి తీసుకురావడం మంచిది కాదంటారు చాలామంది. ప్రస్తుతం దర్శకుడు విజయ్, హీరోయిన్ అమలాపాల్ మధ్య ఇదే వ్యవహారం సాగుతోంది. సరిగ్గా నెల రోజుల కిందట అధికారికంగా విడాకులు తీసుకున్న ఈ జంట ఇప్పుడు కలిసి సినిమా చేయబోతోంది. మరి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారా లేదా ఇద్దర్లోంచి ఒకరు తప్పుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

గతంలో హీరో విజయ్, దర్శకుడు విజయ్, హీరోయిన్ అమలాపాల్ కాంబినేషన్ లో సినిమా వచ్చింది. అన్న పేరుతో అది తెలుగులో కూడా విడుదలైంది. ఆ సినిమా తర్వాతే విజయ్-అమలాపాల్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా విడిపోయిన తర్వాత మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ అయింది. హీరో విజయ్ తో సినిమా చేసేందుకు దర్శకుడు విజయ్ సిద్ధమయ్యాడు. అయితే దర్శకుడితో సంబంధం లేకుండానే హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. దీంతో విజయ్ డైలమాలో పడ్డాడు. అమలాపాల్ ఉంది కాబట్టి తను ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలా లేక తను ఉన్నాడు కాబట్టి అమలాపాల్ తప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఇద్దరూ కలిసి ఒకే సినిమా చేయడం మాత్రం దాదాపు అసంభవం అనే విషయం మాత్రం తేలిపోయింది.

First Published:  25 Aug 2016 9:23 PM GMT
Next Story