Telugu Global
Cinema & Entertainment

నేను 420 అంటున్న వరుణ్ సందేశ్..

ఈమద్యే వరుణ్ సందేశ్ పెళ్లి చేసుకున్నాడు. వితిక అనే హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిసిన వెంటనే హనీమూన్ లాంటివి పెట్టుకోకుండా నేరుగా సినిమాల్లోకి దూరిపోయాడు వరుణ్ సందేష్. అదే మిస్టర్ 420. ఈ చిత్రాన్ని సాన్వి క్రియేషన్స్ బ్యానర్ పై గజ్జల హరికుమార్ రెడ్డి నిర్మిస్తుండగా, ఎస్.ఎస్.రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ సందేశ్ సరసన ప్రియాంక భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర కథ, కథనం విభిన్నంగా ఉండబోతోంది. దానికి […]

నేను 420 అంటున్న వరుణ్ సందేశ్..
X

ఈమద్యే వరుణ్ సందేశ్ పెళ్లి చేసుకున్నాడు. వితిక అనే హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిసిన వెంటనే హనీమూన్ లాంటివి పెట్టుకోకుండా నేరుగా సినిమాల్లోకి దూరిపోయాడు వరుణ్ సందేష్. అదే మిస్టర్ 420. ఈ చిత్రాన్ని సాన్వి క్రియేషన్స్ బ్యానర్ పై గజ్జల హరికుమార్ రెడ్డి నిర్మిస్తుండగా, ఎస్.ఎస్.రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ సందేశ్ సరసన ప్రియాంక భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్ర కథ, కథనం విభిన్నంగా ఉండబోతోంది. దానికి తగ్గట్టుగా వరుణ్ సందేశ్ డిఫరెంట్ లుక్ తో స్టైలిష్ గా కనిపించబోతున్నాడని అంటోంది సినిమా యూనిట్. ఈ మధ్య కాలంలో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న 30-ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ… మిస్టర్-420లో ఓ కీలక పాత్ర పోషించారు. ఇతడి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇంకా రఘు, స్వర్ణ, శేఖర్, సుధీర్ మాస్టర్స్ కొరియోగ్రఫీ తో పాటలకు స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చిందంటున్నారు. మిస్టర్ 420 షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆగస్ట్ 27న మిస్టర్ 420 ఆడియోను రిలీజ్ చేసి … సెప్టెంబర్ 9న గ్రాండ్ గా సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించారు. పెళ్లయిన తర్వాత వరుణ్ సందేశ్ నుంచి వస్తున్న ఈ సినిమా అతడికి ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాలి.

First Published:  22 Aug 2016 11:56 PM GMT
Next Story