Telugu Global
Cinema & Entertainment

మహేష్ సినిమా మళ్లీ మొదలైంది

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం  తెలిసిందే. ఈ సినిమాకు ఈమధ్య బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే… హిందీలో మురుగదాస్ తెరకెక్కించిన అకిరా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు పబ్లిసిటీ కూడా పెండింగ్ లో ఉన్న కారణంగా మహేష్ మూవీకి సెలవులు ఇచ్చేశారు. అకిరా పనులు పూర్తిచేసిన మురుగుదాస్… మళ్లీ ఇవాళ్టి నుంచి మహేష్ బాబు సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. ఈరోజు నుంచి సరిగ్గా వారం రోజుల […]

మహేష్ సినిమా మళ్లీ మొదలైంది
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఈమధ్య బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే… హిందీలో మురుగదాస్ తెరకెక్కించిన అకిరా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు పబ్లిసిటీ కూడా పెండింగ్ లో ఉన్న కారణంగా మహేష్ మూవీకి సెలవులు ఇచ్చేశారు. అకిరా పనులు పూర్తిచేసిన మురుగుదాస్… మళ్లీ ఇవాళ్టి నుంచి మహేష్ బాబు సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. ఈరోజు నుంచి సరిగ్గా వారం రోజుల పాటు అంటే 30వ తేదీ వరకు సినిమా షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి అన్నపూర్ణ స్టుడియోలో ఇప్పటికే భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత… నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని ప్రకటిస్తారు. ఈ సినిమాతో తొలిసారిగా మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అటు దర్శకుడు ఎస్ జే సూర్య కూడా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయం అవుతున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

First Published:  22 Aug 2016 11:52 PM GMT
Next Story