Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజ్ షూటింగ్ కంప్లీట్

మొన్నటివరకు జనతా గ్యారేజ్ షూటింగ్ పై చాలా అనుమానాలు ఉన్నాయి. ఐటెంసాంగ్ కంప్లీట్ అయినా ఇంకా కొంచెం టాకీ బ్యాలెన్స్ ఉందని కొందరు… లేదు షూటింగ్ అయిపోయిందని మరికొందరు వాదించుకోవడం కనిపించింది. ఎట్టకేలకు ఈ విషయంపై స్వయంగా ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. జనతా గ్యారేజ్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు ప్రకటించాడు తారక్. అంతేకాకుండా… షూటింగ్ చివరిరోజున యూనిట్ తో దిగిన ఓ గ్రూప్ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. కాజల్ తో తీసిన ఐటెంసాంగ్ తో జనతా […]

జనతా గ్యారేజ్ షూటింగ్ కంప్లీట్
X

మొన్నటివరకు జనతా గ్యారేజ్ షూటింగ్ పై చాలా అనుమానాలు ఉన్నాయి. ఐటెంసాంగ్ కంప్లీట్ అయినా ఇంకా కొంచెం టాకీ బ్యాలెన్స్ ఉందని కొందరు… లేదు షూటింగ్ అయిపోయిందని మరికొందరు వాదించుకోవడం కనిపించింది. ఎట్టకేలకు ఈ విషయంపై స్వయంగా ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. జనతా గ్యారేజ్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు ప్రకటించాడు తారక్. అంతేకాకుండా… షూటింగ్ చివరిరోజున యూనిట్ తో దిగిన ఓ గ్రూప్ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.

కాజల్ తో తీసిన ఐటెంసాంగ్ తో జనతా గ్యారేజ్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈనెల 27న అంటే మరో 4 రోజుల్లో ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకోనుంది. సెప్టెంబర్ 2న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

First Published:  22 Aug 2016 11:53 PM GMT
Next Story