Telugu Global
NEWS

అమరావతికి అంతలేదంటున్న సుమన్

తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌ నుంచి తరలివెళ్లే విషయంలో సీనియర్ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ అమరావతికి తరలివెళ్లే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదని తేల్చేశారు. అందుకు కారణం కూడా చెప్పారు. ఒకప్పుడు చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ తరలి వచ్చినప్పుడు హైదరాబాద్‌లో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవన్నారు. స్డూడియో కట్టుకోవడానికి, ఇతర అవసరాలకు భూమి సులువుగా దొరికేదన్నారు. ప్రస్తుతం అమరావతిలో ధరలు చూస్తుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. అమరావతి( విజయవాడ)లో […]

అమరావతికి అంతలేదంటున్న సుమన్
X

తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్‌ నుంచి తరలివెళ్లే విషయంలో సీనియర్ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ అమరావతికి తరలివెళ్లే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదని తేల్చేశారు. అందుకు కారణం కూడా చెప్పారు. ఒకప్పుడు చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ తరలి వచ్చినప్పుడు హైదరాబాద్‌లో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవన్నారు. స్డూడియో కట్టుకోవడానికి, ఇతర అవసరాలకు భూమి సులువుగా దొరికేదన్నారు. ప్రస్తుతం అమరావతిలో ధరలు చూస్తుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. అమరావతి( విజయవాడ)లో భూముల ధరలు భారీగా ఉన్నందున చిత్రపరిశ్రమలు తరలివెళ్లడం కష్టమన్నారు సుమన్. హైదరాబాద్‌లో కొత్తగా స్డూడియోలు కూడా వస్తున్నందున తెలుగు చిత్రపరిశ్రమల హైదరాబాద్‌ కేంద్రంగానే ఉంటుందని సుమన్ అభిప్రాయపడ్డారు. కర్నాటకలోని కోలార్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సుమన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

actress-yamuna

chandrababu naidu

pv sindhu caste

ap

pawan kumara swamy meeting

velagapudi secretariate

ragavendra rao annamayya movie story

payyavula keshav

First Published:  21 Aug 2016 11:05 AM GMT
Next Story