Telugu Global
Cinema & Entertainment

 ఫస్ట్ లుక్ కోసం ప్రత్యేక పూజలు

సరిగ్గా మరో 10 రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు వస్తోంది. ఈసారి మెగాస్టార్ పుట్టినరోజు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే… చిరంజీవి తన 150వ సినిమా షురూ చేశాడు. 2 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశాడు. సో… పుట్టినరోజుకు కచ్చితంగా ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ ఆశిస్తారు. చిరంజీవి కొత్త సినిమాలో స్టిల్ అయినా లేదా చిరంజీవి కొత్త సినిమా టైటిల్ అయినా కచ్చితంగా వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈసారి పుట్టినరోజుకు ఏదో ఒకటి రిలీజ్ చేయకపోతే… ఫ్యాన్స్ […]

 ఫస్ట్ లుక్ కోసం ప్రత్యేక పూజలు
X
సరిగ్గా మరో 10 రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు వస్తోంది. ఈసారి మెగాస్టార్ పుట్టినరోజు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే… చిరంజీవి తన 150వ సినిమా షురూ చేశాడు. 2 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశాడు. సో… పుట్టినరోజుకు కచ్చితంగా ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ ఆశిస్తారు. చిరంజీవి కొత్త సినిమాలో స్టిల్ అయినా లేదా చిరంజీవి కొత్త సినిమా టైటిల్ అయినా కచ్చితంగా వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈసారి పుట్టినరోజుకు ఏదో ఒకటి రిలీజ్ చేయకపోతే… ఫ్యాన్స్ ఊరుకోరనే విషయం మెగాస్టార్ కు కూడా తెలుసు. అందుకే ఫస్ట్ లుక్ రెడీ చేసే పనిలో కొంతమంది యూనిట్ సభ్యులు బిజీ అయిపోయారు. ఇదిలా ఉండగా… ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిరంజీవి కుటుంబసభ్యులు వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రారంభం నుంచి సినిమాకు సంబంధించి వివిధ రకాల పూజలు చేస్తున్న మెగా ఫ్యామిలీ ఈసారి ఫస్ట్ లుక్ కార్యక్రమం కూడా సాఫీగా జరగాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటోంది.
First Published:  18 Aug 2016 7:08 AM GMT
Next Story