Telugu Global
Cinema & Entertainment

రోడ్డు ప్ర‌మాదంలో జ‌బ‌ర్ద‌స్త్‌ రోహిణి రెడ్డికి గాయాలు!

జ‌బ‌ర్ద‌స్త్ నటి రోహిణిరెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డింది. కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం స‌మీపంలో ఆమె ప్రయాణిస్తున్న  కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఆమె ప్ర‌యాణిస్తున్న బెలినో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో రోహిణి ప్ర‌యాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జు నుజ్జ‌యింది. ఈ ప్ర‌మాదంలో రోహిణిరెడ్డి తీవ్రంగా గాయ‌ప‌డింది. ఆమె డ్రైవ‌ర్ ఉష‌ప్ప‌గౌడ్, అసిస్టెంట్ చంటిల‌కూ కూడా గాయాల‌య్యాయి. రోహిణిరెడ్డి కాలికి తీవ్ర గాయ‌మైంది. ప్ర‌స్తుతం స‌మీపంలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఈ ప్ర‌మాదం […]

రోడ్డు ప్ర‌మాదంలో జ‌బ‌ర్ద‌స్త్‌ రోహిణి రెడ్డికి గాయాలు!
X
జ‌బ‌ర్ద‌స్త్ నటి రోహిణిరెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డింది. కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం స‌మీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఆమె ప్ర‌యాణిస్తున్న బెలినో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో రోహిణి ప్ర‌యాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జు నుజ్జ‌యింది. ఈ ప్ర‌మాదంలో రోహిణిరెడ్డి తీవ్రంగా గాయ‌ప‌డింది. ఆమె డ్రైవ‌ర్ ఉష‌ప్ప‌గౌడ్, అసిస్టెంట్ చంటిల‌కూ కూడా గాయాల‌య్యాయి. రోహిణిరెడ్డి కాలికి తీవ్ర గాయ‌మైంది. ప్ర‌స్తుతం స‌మీపంలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఈ ప్ర‌మాదం కార‌ణంగా ప‌లు షూటింగ్‌ల‌ను రోహిణి రెడ్డి వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది.
First Published:  14 Aug 2016 12:07 AM GMT
Next Story