Telugu Global
Cinema & Entertainment

బాహుబలి టార్గెట్ మొదటిసారి మిస్అయ్యింది

అన్నీ మనమనుకున్నట్లు జరగవు. బాహుబలి-2 కి సంబంధించి ఏ విషయమయినా చాలా హైప్‌ని క్రియేట్ చేసి టాక్ ఆఫ్ ద టవున్ అయి కూర్చుంటున్నది. కాని అన్ని వేళలా అలాగే జరుగుతుందని చెప్పలేము. బాహుబలి ట్విట్టర్ హ్యాండిల్ కి సంబంధించిన ఒక పొరపాటు జరిగింది. ఇప్పుడు జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో మన భారతదేశ షూటర్స్ ఆర్చెరీ విభాగం నుండి విఫలమై వెనుదిరిగారు. ఆర్చెరీలో భారతదేశ షూటర్స్ విఫలమయ్యారు కాని, అవంతిక (తమన్నా చేసిన క్యారెక్టర్) మాత్రం తన […]

బాహుబలి టార్గెట్ మొదటిసారి మిస్అయ్యింది
X

అన్నీ మనమనుకున్నట్లు జరగవు. బాహుబలి-2 కి సంబంధించి ఏ విషయమయినా చాలా హైప్‌ని క్రియేట్ చేసి టాక్ ఆఫ్ ద టవున్ అయి కూర్చుంటున్నది. కాని అన్ని వేళలా అలాగే జరుగుతుందని చెప్పలేము. బాహుబలి ట్విట్టర్ హ్యాండిల్ కి సంబంధించిన ఒక పొరపాటు జరిగింది. ఇప్పుడు జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో మన భారతదేశ షూటర్స్ ఆర్చెరీ విభాగం నుండి విఫలమై వెనుదిరిగారు. ఆర్చెరీలో భారతదేశ షూటర్స్ విఫలమయ్యారు కాని, అవంతిక (తమన్నా చేసిన క్యారెక్టర్) మాత్రం తన టార్గెట్ మిస్ అవ్వదు అంటూ బాహుబలి సినిమాలో తమన్నా విల్లుకు బాణం ఎక్కుపెట్టివున్న ఫొటో జతపరిచారు. ఇంకేముంది? సోషల్ మీడియా వాడేవారికి ఇది నచ్చలేదు. సినిమాలో అవంతిక ఒక కల్పిత పాత్ర. పతకాలు గెలవలేకపోయినంత మాత్రాన, మన షూటర్స్ ప్రతిభను ఒక కల్పిత పాత్రతో పోల్చి అవమానించడంపై చిన్న దుమారం రేగేసరికి.. వెంటనే ఆ ట్వీట్‌ని తొలగించారు.

tamanna

First Published:  11 Aug 2016 10:08 PM GMT
Next Story