Telugu Global
Cinema & Entertainment

అమ‌లాపాల్ డైవ‌ర్స్  కు  ప్రియ‌మ‌ణి, మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఘాటు కామెంట్స్...

దక్షిణాది నటి అమలా పాల్, దర్శకుడు విజయ్ ఆనంద్ ల వివాహ బంధం తెరపడనుంది. విడాకులు తీసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకుని కోర్టు గుమ్మం ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై స్టార్ హీరోయిన్స్ ప్రియమణి, మమతా మోహన్ దాస్ మీడియాతో మాట్లాడారు. విజయ్ ని తప్పు పట్టారు. సినిమాల్లో నటించాలనుకునే హీరోయిన్లు దయచేసి పెళ్లికి దూరంగా ఉంటే మంచిదని ప్రియమణి, మమతా మోహన్‌దాస్‌లు సలహా ఇస్తున్నారు. సినిమాల్లో నటించాలనుకునే హీరోయిన్ల వ్యక్తిగత హక్కు, స్వేచ్ఛపై వాళ్ల […]

అమ‌లాపాల్ డైవ‌ర్స్  కు  ప్రియ‌మ‌ణి, మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఘాటు కామెంట్స్...
X
దక్షిణాది నటి అమలా పాల్, దర్శకుడు విజయ్ ఆనంద్ ల వివాహ బంధం తెరపడనుంది. విడాకులు తీసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకుని కోర్టు గుమ్మం ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై స్టార్ హీరోయిన్స్ ప్రియమణి, మమతా మోహన్ దాస్ మీడియాతో మాట్లాడారు. విజయ్ ని తప్పు పట్టారు. సినిమాల్లో నటించాలనుకునే హీరోయిన్లు దయచేసి పెళ్లికి దూరంగా ఉంటే మంచిదని ప్రియమణి, మమతా మోహన్‌దాస్‌లు సలహా ఇస్తున్నారు. సినిమాల్లో నటించాలనుకునే హీరోయిన్ల వ్యక్తిగత హక్కు, స్వేచ్ఛపై వాళ్ల భర్తల పెత్తనం ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. వారు మాట్లాడుతూ..’ఈ విషయం చాలా దారణమైన నిర్ణయంతో ముగియటం బాధగా ఉంది. పెళ్లైనంత మాత్రాన ఒక మహిళ తన జీవితాన్ని ఎంచుకునే హక్కును ఎలా కాలరాస్తారు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. అమలాపాల్‌ను వంటగదికే పరిమితం చేయాలనుకోవడం విజయ్ కుటుంబానికి తగదని హితవుపలికారు. సినిమాల్లోనే కొనసాగాలనుకునే హీరోయిన్లు పెళ్లి చేసుకోకపోతేనే మంచిదని ఈ హీరోయిన్స్ ఇద్దరూ సలహా ఇచ్చారు.అన్న‌ట్లు మ‌మ‌తా మోహ‌న్ దాస్ కొన్ని తెలుగు చిత్రాలు చేసింది. కెరీర్ డ‌ల్ అయిన త‌రువాత త‌న చిన్న‌నాటి మిత్రుడిని పెళ్లాడింది. కానీ పెళ్లైన రెండు సంవ‌త్స‌రాల్లోనే వారి బంధం బ్రేక‌ప్ అయిన విష‌యం తెలిసిందే.
ఇక అమలా పాల్, విజయ్ లు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేయాలని కోరుతూ శనివారం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి ముందు వారిద్దరూ హాజరై హిందు వివాహ చట్టం ప్రకారం తమకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు కోర్టు రిజిస్ట్రిని సంప్రదించాల్సిందిగా న్యాయమూర్తి వారికి సూచించారు. అమలా పాల్, విజయ్ లు ఇద్దరూ డబ్బు లేదా భరణం వంటి డిమాండ్లు చేయలేదు. ఆ రోజు నుంచి ఆరు నెలల కాలవ్యవధి ముగిసిన తర్వాత వారిద్దరూ సమ్మతిస్తే విడాకులు మంజూరవుతాయి
First Published:  11 Aug 2016 12:10 AM GMT
Next Story