Telugu Global
Cinema & Entertainment

విడుదలకు సిద్ధమైన ప్రేమమ్

  నాగచైతన్య హీరోగా… శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ప్రేమమ్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. మలయాళం సినిమాకు రీమేక్ గా అదే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9న ప్రేమమ్ ను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. సినిమాకు సంబంధించిన తొలిపాటను ఈనెల 18న ఎఫ్ ఎం రేడియోల ద్వారా విడుదల చేస్తారు. […]

విడుదలకు సిద్ధమైన ప్రేమమ్
X
నాగచైతన్య హీరోగా… శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ప్రేమమ్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. మలయాళం సినిమాకు రీమేక్ గా అదే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 9న ప్రేమమ్ ను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. సినిమాకు సంబంధించిన తొలిపాటను ఈనెల 18న ఎఫ్ ఎం రేడియోల ద్వారా విడుదల చేస్తారు. ఈనెల 24న పూర్తి ఆడియో రిలీజ్ ను ఘనంగా నిర్వహిస్తారు. పూర్తి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించాడు. ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్… ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలనుకుంటున్నాడు చైతూ.
First Published:  9 Aug 2016 10:26 AM GMT
Next Story