Telugu Global
Cinema & Entertainment

ఒకేసారి రెండు సినిమాలు...

వెంకటేష్ స్పీడు పెంచాడు. ఇన్నాళ్లూ నయనతార కాల్షీట్లు ఎడ్జెస్ట్ కాకపోవడం వల్ల బాబు బంగారం సినిమా లేట్ అయింది. ఇకపై ఆ గ్యాప్ ను భర్తీ చేస్తూ దూసుకుపోతానంటున్నాడు. ఈ వీకెండ్ బాబు బంగారం సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఆ వెంటనే బ్యాక్-టు-బ్యాక్ రెండు సినిమాల్ని లైన్లో పెట్టడానికి వెంకీ రెడీ అవుతున్నాడు. వీటిలో మొదటగా సాలాఖదూస్ రీమేక్ ఉంటుంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకివస్తుంది. ఆ వెంటనే […]

ఒకేసారి రెండు సినిమాలు...
X

వెంకటేష్ స్పీడు పెంచాడు. ఇన్నాళ్లూ నయనతార కాల్షీట్లు ఎడ్జెస్ట్ కాకపోవడం వల్ల బాబు బంగారం సినిమా లేట్ అయింది. ఇకపై ఆ గ్యాప్ ను భర్తీ చేస్తూ దూసుకుపోతానంటున్నాడు. ఈ వీకెండ్ బాబు బంగారం సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఆ వెంటనే బ్యాక్-టు-బ్యాక్ రెండు సినిమాల్ని లైన్లో పెట్టడానికి వెంకీ రెడీ అవుతున్నాడు. వీటిలో మొదటగా సాలాఖదూస్ రీమేక్ ఉంటుంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకివస్తుంది. ఆ వెంటనే మరో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు వెంకీ. నేను శైలజ సినిమాతో హిట్ అందుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడు.

పీఆర్ సినిమా బ్యానర్ పై రామ్ మోహన్ రావు నిర్మించనున్న ఈ సినిమాకు ఆడాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని నిర్మాత ప్రకటించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీకి మంచి ఇమేజ్ ఉంది. మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు వెంకీని బాగా ఆదరిస్తారు. అందుకే ఆ రెండు వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని… ఆడాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అప్పట్లో 80వ దశకంలో ఈ తరహా పేర్లతో పలు సినిమాలు తెరకెక్కాయి. మళ్లీ ఆ ట్రెండ్ ను రిపీట్ చేయాలని వెంకీ భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో బాబు బంగారం రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

First Published:  8 Aug 2016 9:24 PM GMT
Next Story