Telugu Global
NEWS

కేటీఆర్ అందుకే క‌నిపించ‌లేదా?

తెలంగాణ ఆవిర్భ‌వించి రెండేళ్లు గ‌డిచాక తొలిసారిగా ప్ర‌ధాని మోదీ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ప్ర‌ధాని భ‌ద్ర‌త నేప‌థ్యంలో చాలా త‌క్కువ మంది టీఆర్ ఎస్ మంత్రులు మాత్ర‌మే వేదిక‌పైకి వ‌చ్చారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హ‌రీశ్‌రావు, ఉభ‌య‌స‌భ‌ల స్పీక‌ర్లు వేదిక‌పై క‌నిపించారు. మ‌రో కీల‌క నేత‌, రాష్ట్ర ఐటీ , మునిసిప‌ల్ శాఖామంత్రి కేటీఆర్ మాత్రం వేదిక‌పై క‌నిపించ‌లేదు. కేసీఆర్ త‌రువాత సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌చారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో కేటీఆర్ ప్ర‌ధానితోపాటు వేదిక పంచుకోక‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు […]

కేటీఆర్ అందుకే క‌నిపించ‌లేదా?
X
తెలంగాణ ఆవిర్భ‌వించి రెండేళ్లు గ‌డిచాక తొలిసారిగా ప్ర‌ధాని మోదీ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ప్ర‌ధాని భ‌ద్ర‌త నేప‌థ్యంలో చాలా త‌క్కువ మంది టీఆర్ ఎస్ మంత్రులు మాత్ర‌మే వేదిక‌పైకి వ‌చ్చారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హ‌రీశ్‌రావు, ఉభ‌య‌స‌భ‌ల స్పీక‌ర్లు వేదిక‌పై క‌నిపించారు. మ‌రో కీల‌క నేత‌, రాష్ట్ర ఐటీ , మునిసిప‌ల్ శాఖామంత్రి కేటీఆర్ మాత్రం వేదిక‌పై క‌నిపించ‌లేదు. కేసీఆర్ త‌రువాత సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌చారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో కేటీఆర్ ప్ర‌ధానితోపాటు వేదిక పంచుకోక‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. తెలుగు రాష్ర్టాలు, జాతీయ‌ మీడియా ప్ర‌తినిధులు ఈ ప్రోగ్రాంను క‌వ‌ర్ చేసేందుకు వ‌చ్చారు. వీరంద‌రి క‌ళ్లు కేటీఆర్ కోసం వెదికాయి. తెలంగాణ‌పై కేంద్రం స‌వ‌తి ప్రేమ ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ప‌లుమార్లు టీఆర్ ఎస్ నాయకులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర – రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య నెల‌కొన్న అగాథాన్ని దూరం చేసేందుకు కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌ధానిని ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. మ‌రి ఇంత ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి త‌న రాజ‌కీయ వార‌సుడు, కేటీఆర్‌ను ఎందుకు తీసుకురాలేదు అన్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌.
అటు తెలంగాణ‌లో, ఇటుపార్టీలో రోజురోజుకు త‌న ప‌ర‌ప‌తి పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు కేటీఆర్‌. అందులో భాగంగానే ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌సంగాలు చేస్తూ త‌న ప‌రిధిని విస్త‌రించుకుంటున్నారు. అలాంటిది మోదీ పాల్గొన్న కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన‌క‌పోవ‌డానికి ఓ కార‌ణం ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. తెలంగాణ‌లో అధికార‌పార్టీని విమ‌ర్శించిన ప్ర‌తిసారీ బీజేపీకి దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చేవారు. ప్ర‌పంచ‌దేశాలు తిరిగే మోదీకి తెలంగాణ ఎక్క‌డుందో తెలియ‌దా? ఆయ‌న తెలంగాణ‌కు ప్ర‌ధాని కాదా? తెలంగాణ‌కు ఎందుకు రావ‌డం లేదు? అని కేటీఆర్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు బీజేపీ నేత‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలో తెలిసేది కాదు. రెండు వారాల క్రితం తెలంగాణ‌లో ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయిన‌ప్ప‌టి నుంచి క‌మ‌ల‌నాథులు కేటీఆర్‌పై చెల‌రేగుతున్నారు. కేంద్రంతో స‌ఖ్యత చెడ‌కూడ‌ద‌న్న ఆందోళ‌న‌తో పార్టీ శ్రేణులెవ‌రూ బీజేపీని విమ‌ర్శించ‌కుండా ఆదేశించాడు కేసీఆర్‌. దీంతో అంద‌రితోపాటు బీజేపీపై ఒంటికాలిపై లేచే కేటీఆర్ కూడా సైలెంట్ అయ్యారు. మోదీని ఎడాపెడా విమ‌ర్శించిన కేటీఆర్‌ను స‌భ‌కు తీసుకురాక‌పోవ‌డం వెన‌క కార‌ణం అదేనా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ, జాతీయ చేనేత దినోత్స‌వంలో కేటీఆర్ పాల్గొనాల్సి వ‌చ్చింద‌ని, అందుకే ఆయ‌న రాలేద‌ని, ఇందులో మ‌రే ఇత‌ర కార‌ణాలు లేవ‌ని చెబుతున్నారు గులాబీ నేత‌లు.

Click on Image to Read:

ap ministers

ys jagan

ys-jagan-2

sunitha

kcr

mahatma statue

kcr

mla kurugodla ramakrishna

ramoji rao

jc diwakar reddy

by ramaiah

pawan-kalyan

pranab-chandrababu-naidu

First Published:  7 Aug 2016 10:08 PM GMT
Next Story