Telugu Global
Cinema & Entertainment

మొన్న బిచ్చగాడు... ఇప్పుడు భేతాళుడు

బిచ్చగాడు సినిమా టాలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. చాలా ఏరియాల్లో ఈ సినిమా దిగ్విజయంగా 50రోజులు పూర్తిచేసుకుంది. 20లక్షలు పెట్టి కొన్న ఈ సినిమాకు 20కోట్ల రూపాయలు వచ్చాయి. ఇఁకా లాభాలు వస్తూనే ఉన్నాయి. బిచ్చగాడుతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయాడు. దీంతో అతడి నెక్ట్స్ సినిమా కోసం కూడా చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మొన్న బిచ్చగాడిగా అలరించిన విజయ్ ఆంటోనీ… త్వరలోనే భేతాళుడిగా మనముందుకు రాబోతున్నాడు. తన తమిళ సినిమా […]

మొన్న బిచ్చగాడు... ఇప్పుడు భేతాళుడు
X
బిచ్చగాడు సినిమా టాలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. చాలా ఏరియాల్లో ఈ సినిమా దిగ్విజయంగా 50రోజులు పూర్తిచేసుకుంది. 20లక్షలు పెట్టి కొన్న ఈ సినిమాకు 20కోట్ల రూపాయలు వచ్చాయి. ఇఁకా లాభాలు వస్తూనే ఉన్నాయి. బిచ్చగాడుతో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయాడు. దీంతో అతడి నెక్ట్స్ సినిమా కోసం కూడా చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మొన్న బిచ్చగాడిగా అలరించిన విజయ్ ఆంటోనీ… త్వరలోనే భేతాళుడిగా మనముందుకు రాబోతున్నాడు. తన తమిళ సినిమా ‘సైతాన్’ను తెలుగులో ‘బేతాళుడు’ పేరుతో విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. విజయ్ ఆంటోనీకి చెందిన ఓ సినిమా ఇలా ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదలవ్వడం ఇదే తొలిసారి. అంతేకాదు… భేతాళుడు రిజల్ట్ చూసి… త్వరలోనే నేరుగా తెలుగులో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట విజయ్ ఆంటోనీ.
First Published:  6 Aug 2016 12:40 PM GMT
Next Story