Telugu Global
Cinema & Entertainment

బాహుబలి-2 రెండు వారాలు వాయిదా

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మూవీని రెండు వారాలు వాయిదా వేసి… ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్ణయించారు. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తో చర్చలు జరిపిన అనంతరం… యూనిట్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి భాగాన్ని హిందీలో పంపిణీ చేసిన కరణ్ జోహార్… రెండో భాగం రైట్స్ కూడా […]

బాహుబలి-2 రెండు వారాలు వాయిదా
X
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మూవీని రెండు వారాలు వాయిదా వేసి… ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్ణయించారు. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తో చర్చలు జరిపిన అనంతరం… యూనిట్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి భాగాన్ని హిందీలో పంపిణీ చేసిన కరణ్ జోహార్… రెండో భాగం రైట్స్ కూడా దక్కించుకున్నాడు. నిర్మాతలతో చర్చలు జరిపిన కరణ్ జోహార్… ఏప్రిల్ 28 తేదీ అయితే ఇంకా బాగుంటుందని… బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ ఖాళీగా ఉంటుందని సూచించడంతో… ఆ తేదీని ఫిక్స్ చేశారు. మరోవైపు బాహుబలి రిలీజ్ డేట్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం నడుస్తున్న షూటింగ్ సరళిని గమనిస్తే… సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో వచ్చేది అనుమానమే అంటున్నారు. ఎఁదుకంటే.. షూటింగ్ సకాలంలో పూర్తయినప్పటికీ… పోస్ట్ ప్రొడక్షన్స్, గ్రాఫిక్ వర్క్ సకాలంలో పూర్తికాదని విశ్లేషిస్తున్నారు.
First Published:  5 Aug 2016 5:01 AM GMT
Next Story