Telugu Global
Cinema & Entertainment

కేర‌ళ  రోడ్ల‌మీద  ఎన్టీఆర్...! 

రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించిన దర్శ‌కుడు కొర‌టాల శివతో   ప్ర‌స్తుతం  జూనియ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న  చిత్రం పై ఆయ‌న అభిమానులు  భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.   ఎందుకంటే  ఎన్టీఆర్ కెరీర్ లో   సింహాద్రిలాంటి  ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్  ఆ చిత్రం త‌రువాత  ఇంత వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు  ఇవ్వ‌లేక పోయారు. దీంతో    సింపుల్ కాన్సెప్ట్ తో    మిర్చి, శ్రీ‌మంతుడు చిత్రాల‌తో   ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా  చాటిన కొర‌టాల  శివ‌.. […]

కేర‌ళ  రోడ్ల‌మీద  ఎన్టీఆర్...! 
X
రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించిన దర్శ‌కుడు కొర‌టాల శివతో ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం పై ఆయ‌న అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రిలాంటి ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఆ చిత్రం త‌రువాత ఇంత వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు ఇవ్వ‌లేక పోయారు.
దీంతో సింపుల్ కాన్సెప్ట్ తో మిర్చి, శ్రీ‌మంతుడు చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా చాటిన కొర‌టాల శివ‌.. ఎన్టీఆర్ తో జ‌త క‌ట్ట‌డంతో అంచ‌నాలు పెరిగాయి. జ‌న‌త గ్యారేజ్ పేరుతో చేస్తున్న ఈ చిత్రం ఈ నెలలో రిలీజ్ అవుతుంద‌నే టాక్ వినిపించిది. అయితే ఈ చిత్రంలో సాంగ్స్ షూట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ట్రావెల్ నేప‌థ్యంగా సాగే ఒక సాంగ్ ను ఎన్టీఆర్ పై చిత్రీక‌రిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ అయిన త‌రువాత‌.. కాజ‌ల్ తో స్పెష‌ల్ సాంగ్ ను హైద‌రాబాద్ లో షూట్ చేస్తార‌ని తెలుస్తుంది. ఈ సినిమా టీజ‌ర్ కు సామాజిక మాధ్య‌మాల్లో మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ ను ఈ నెల 12 లేదా 13 న గ్రాండ్ గా చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఎన్టీఆర్ తో పాటు.. ఆయ‌న ఫ్యాన్స్ ఆశిస్తున్న భారీ హిట్ జ‌న‌తా గ్యారేజ్ తో కొర‌టాల శివ ఇస్తాడేమో వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఐఐటి స్టూడెంట్ గా న‌టిస్తున్నాడు. ఆయ‌న మామ‌య్య గా మోహ‌న్ లాల్ చేస్తున్న విష‌యం తెలిసిందే.
First Published:  2 Aug 2016 10:00 PM GMT
Next Story