Telugu Global
Cinema & Entertainment

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి...

తిక్క ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆడియో వేడుకలో హీరోతో పాటు హీరోయిన్లు మన్నారా చోప్రా, లారిస్సా బొనేసి పాల్గొన్నారు. ఈ వేడుకలోనే బ్రెజిల్ బ్యూటీ లారిస్సా, సాయిధర్మతేజ మధ్య ఎంతటి అనుబంధం ఉందో బయటపడింది. ఆరడగులకు పైగా హైట్ తో ఆకట్టుకున్న ఈ బ్రెజిల్ భామ ఏదో కొంచెం స్పీచ్ ఇచ్చి వెళ్లిపోకుండా.. ముందు కవ్వించి, తర్వాత కాస్త ఎమోషనల్ గా మారి […]

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి...
X

తిక్క ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆడియో వేడుకలో హీరోతో పాటు హీరోయిన్లు మన్నారా చోప్రా, లారిస్సా బొనేసి పాల్గొన్నారు. ఈ వేడుకలోనే బ్రెజిల్ బ్యూటీ లారిస్సా, సాయిధర్మతేజ మధ్య ఎంతటి అనుబంధం ఉందో బయటపడింది. ఆరడగులకు పైగా హైట్ తో ఆకట్టుకున్న ఈ బ్రెజిల్ భామ ఏదో కొంచెం స్పీచ్ ఇచ్చి వెళ్లిపోకుండా.. ముందు కవ్వించి, తర్వాత కాస్త ఎమోషనల్ గా మారి కంటతడి పెట్టుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ముందుగా మైక్ తీసుకున్న లారిస్సా.. అందరికీ నమస్కారం అంటూ, సినిమా మేకర్స్ కు థాంక్స్ చెప్పి…. తర్వాత ఛాన్స్ ఇచ్చి అండగా నిలిచిన సాయిధరమ్ తేజ్ ను దగ్గరకు తీసుకుని, అతడి భుజంపై తనదైన స్టైల్లో చెయ్యేసి థాంక్స్ చెప్పడం గమనార్హం. దీంతో ఎదురుగా ఉన్న మెగా ఫ్యాన్స్ కెవ్వు కేక అంటూ ఓ రేంజ్ లో అరవడం, తేజూ కూడా నవ్వుల్లో మునిగిపోవడం విశేషం. తొలిసారిగా ఇలాంటి వేదికపై మాట్లాడుతున్నందుకు, మనోళ్లు చూపిస్తున్న అభిమానాన్ని తట్టుకోలేక లారిస్సా కొంచెం ఎమోషనల్ గా మారిపోయి కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఇదంతా బ్రెజిల్ లో ఉన్న మా అమ్మానాన్న చూస్తూనే ఉంటారని, థాంక్యూ ఆల్ అంటూ ఆనంద భాష్పాలతో తన స్పీచ్ ను ముగించింది. అంత మంది సమక్షంలో…. వేదికపై సాయిధర్మతేజతో లారిస్సా అంత చనువుగా ఉండడం చాలా మందిని ఎట్రాక్ట్ చేసింది. కాకపోతే… విదేశీ భామల తీరే అంత అంటూ చాలామంది తమనుతాము నచ్చజెప్పుకోవడం కూడా కనిపించింది. ఏదేమైనా… ఈ ఎపిసోడ్ తో సాయిధరమ్ తేజ… హీరోయిన్ల విషయంలో ఎంత క్లోజ్ గా ఉంటాడో మరోసారి ప్రూవ్ అయింది.

Click on Image to Read:

pattiseema project

chandrababu modi

ke krishnamurty

undavalli-letter

888

lagadapati-rajgopal

jc comments

chandrababu

ysr statue

ysrcp zptc

akula-satyanarayana

kvp chandrababu naidu

First Published:  31 July 2016 9:47 PM GMT
Next Story