Telugu Global
Cinema & Entertainment

మహేష్ అప్పుడు మిస్ అయ్యాడు.. ఇప్పుడు దొరికాడు..

ఈ స్టేట్ మెంట్ ఇస్తున్న బ్యూటీ ఎవరో కాదు… టాలీవుడ్ హాట్ అందగత్తె రకుల్ ప్రీత్ సింగ్. టార్గెట్ మహేష్ అనే ప్రాజెక్టును ఏడాదిగా అమలు చేస్తున్నానని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్. బ్రహ్మోత్సవం టైమ్ లో మహేష్ మిస్ అయ్యాడని, ఈసారి అతడ్ని వదిలేదని లేదని అందుకే… ఆపరేషన్ మహేష్ ప్రాజెక్టు చేపట్టి సక్సెస్ అయ్యానని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మురుగదాస్-మహేష్ సినిమాలో ఛాన్స్ ఊరికే రాలేదని… దాదాపు ఏడాదిగా ప్రయత్నిస్తున్నానని స్పష్టంచేసింది. ఈసారి […]

మహేష్ అప్పుడు మిస్ అయ్యాడు.. ఇప్పుడు దొరికాడు..
X

ఈ స్టేట్ మెంట్ ఇస్తున్న బ్యూటీ ఎవరో కాదు… టాలీవుడ్ హాట్ అందగత్తె రకుల్ ప్రీత్ సింగ్. టార్గెట్ మహేష్ అనే ప్రాజెక్టును ఏడాదిగా అమలు చేస్తున్నానని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్. బ్రహ్మోత్సవం టైమ్ లో మహేష్ మిస్ అయ్యాడని, ఈసారి అతడ్ని వదిలేదని లేదని అందుకే… ఆపరేషన్ మహేష్ ప్రాజెక్టు చేపట్టి సక్సెస్ అయ్యానని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మురుగదాస్-మహేష్ సినిమాలో ఛాన్స్ ఊరికే రాలేదని… దాదాపు ఏడాదిగా ప్రయత్నిస్తున్నానని స్పష్టంచేసింది.

ఈసారి తన ఆనందం రెట్టింపు అయిందని అంటోంది రకుల్. ఎందుకంటే… గజనీ సినిమా నుంచి మురుగదాస్ కు ఫ్యాన్ అయిపోయానని… ఇక ఇండస్ట్రీలోకి వచ్చాక మహేష్ తో చేయాలనే డ్రీమ్ ఉందని… ఈ రెండూ ఒకే సినిమాతో ఫుల్ ఫిల్ అయ్యాయని తెగ సంబరపడి పోతోంది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా… కథ కూడా వినకుండా గుడ్డిగా ప్రాజెక్టుపై సంతకం చేసేశానని చెబుతోంది. అంతేకాదు… ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ గురించి కూడా ఆలోచించలేదని అంటోంది. ప్రస్తుతం రకుల్ సినిమాకు కోటి నుంచి కోటి 30లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తోంది. కానీ మహేష్-మురుగదాస్ సినిమా కోసం కోటి కంటే తక్కువకే కాల్షీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.

First Published:  31 July 2016 1:16 AM GMT
Next Story