Telugu Global
Cinema & Entertainment

మంచు లక్ష్మి అక్కకు ఎన్ని కళలో!

కళామ తల్లి ముద్దుబిడ్డ మంచు లక్ష్మి. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తనయగా అందరికీ పరిచయమైనా..తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మి. సినీ, వ్యాపార రంగాలతో పరిచయం లేని చిన్నవయస్సులోనే తన తండ్రి నిర్మాణ సంస్థకు తన పేరుతోనే సక్సెస్‌ అయ్యాడు. అంతటి లక్కీ హ్యాండ్‌ లక్ష్మిది అని మోహన్‌బాబుతోపాటు ఇండస్ర్టీలో వున్నవారూ గుర్తించారు. పెరిగి పెద్దయ్యాక..తండ్రి నటవారసత్వం పుణికిపుచ్చుకున్న మంచు లక్ష్మి గుండెల్లో గోదారి, ఊ కొడతారా..ఉలిక్కిపడతారా, అనగనగా ఓ ధీరుడు వంటి సినిమాలతో అద్భుత […]

మంచు లక్ష్మి అక్కకు ఎన్ని కళలో!
X

కళామ తల్లి ముద్దుబిడ్డ మంచు లక్ష్మి. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తనయగా అందరికీ పరిచయమైనా..తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మి. సినీ, వ్యాపార రంగాలతో పరిచయం లేని చిన్నవయస్సులోనే తన తండ్రి నిర్మాణ సంస్థకు తన పేరుతోనే సక్సెస్‌ అయ్యాడు. అంతటి లక్కీ హ్యాండ్‌ లక్ష్మిది అని మోహన్‌బాబుతోపాటు ఇండస్ర్టీలో వున్నవారూ గుర్తించారు. పెరిగి పెద్దయ్యాక..తండ్రి నటవారసత్వం పుణికిపుచ్చుకున్న మంచు లక్ష్మి గుండెల్లో గోదారి, ఊ కొడతారా..ఉలిక్కిపడతారా, అనగనగా ఓ ధీరుడు వంటి సినిమాలతో అద్భుత నటనను ప్రదర్శించింది. గాయకురాలిగా కూడా ఈ మధ్య తెగ పాడేస్తోంది. “ఏందిరో ఈ మగాళ్ల గొప్ప” అంటూ గొంతు చించుకుంది. అలాగే “మేము సైతం” అంటూ జెమినిలో తానే యాంకర్‌, ప్రొడ్యూసర్‌గా ఓ ప్రోగ్రాం చేస్తోంది. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. కొన్ని కార్యక్రమాలకు యాంకర్‌గా కూడా పనిచేసి బుల్లితెరకు తన సత్తా ఏంటో చూపింది. జెమినిలో “బూమ్‌ బూమ్‌” అంటూ హుషారెక్కించే ప్రోగ్రాం చేసింది. “లక్ష్మి టాక్‌ షో” అని ఓ సూపర్‌హిట్‌ చేసింది. ఏ రంగంలోనైనా తనకు తిరుగులేదని నిరూపించుకున్న మంచులక్ష్మి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది. లక్ష్మి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. మరోవైపు భర్త ఆండీ శ్రీనివాసన్‌తో కలిసి హోటల్‌ బిజినెస్‌ కూడా ప్రారంభించింది. ఏ రంగమైనా తానే ఒక బ్రాండ్ గా సక్సెస్‌ సాధిస్తున్న మంచులక్ష్మిని చూసి..అక్కకు ఎన్ని కళలో అని ముక్కున వేలేసుకుంటున్నారు జనం.

Click on Image to Read:
differences-between-anasuya
chiru
prabhudeva
chiru-150th-movie
shahrukh-sunny
First Published:  28 July 2016 11:52 PM GMT
Next Story