Telugu Global
Cinema & Entertainment

సునీల్ కు అరవింద్ పోటు

ఎన్నో కష్టాలు పడి, కిందామీదా పడి ఎట్టకేలకు జక్కన్నను విడుదలకు సిద్ధం చేశారు. ఓవర్సీస్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకురాకపోతే… ఎలాగోలా చర్చలు జరిపి అయినకాడికి అమ్ముకున్నారు. ఇంత కష్టపడి సినిమా విడుదలైన తర్వాత…. జక్కన్నకు హిట్ టాక్ వచ్చిందనుకోండి. సునీల్ ఫుల్ హ్యాపీ. చాన్నాళ్ల తర్వాత మంచి హిట్ కొట్టిన ఆనందం దక్కుతుంది. కానీ ఆ ఆనందాన్ని సునీల్ కు ఇవ్వడానికి ఎంత మాత్రం ఇష్టపడడం లేదు మెగా ప్రొడ్యూసర్ […]

సునీల్ కు అరవింద్ పోటు
X
ఎన్నో కష్టాలు పడి, కిందామీదా పడి ఎట్టకేలకు జక్కన్నను విడుదలకు సిద్ధం చేశారు. ఓవర్సీస్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకురాకపోతే… ఎలాగోలా చర్చలు జరిపి అయినకాడికి అమ్ముకున్నారు. ఇంత కష్టపడి సినిమా విడుదలైన తర్వాత…. జక్కన్నకు హిట్ టాక్ వచ్చిందనుకోండి. సునీల్ ఫుల్ హ్యాపీ. చాన్నాళ్ల తర్వాత మంచి హిట్ కొట్టిన ఆనందం దక్కుతుంది. కానీ ఆ ఆనందాన్ని సునీల్ కు ఇవ్వడానికి ఎంత మాత్రం ఇష్టపడడం లేదు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. సునీల్ నటించిన జక్కన్న సినిమా విడుదలైన వారం రోజులకు తన చిన్నకొడుకు శిరీష్ నటించిన శ్రీరస్తు-శుభమస్తు సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. వారం తర్వాత శిరీష్ సినిమా రావడం వల్ల సునీల్ కు వచ్చిన ముప్పేమీ లేదు. కాకపోతే… జక్కన్నకు హిట్ టాక్ వచ్చినా కూడా శిరీష్ కోసం కొన్ని థియేటర్లలోంచి సునీల్ సినిమాను లేపేయడం ఖాయం. అందుకే ఇప్పుడు సునీల్ తెగ బాధపడుతున్నాడు. ఒకవేళ తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే… అప్పుడు అరవింద్ తో సంప్రదింపులు జరపడానికి సునీల్ సిద్ధంగా ఉన్నాడు.
First Published:  27 July 2016 4:47 AM GMT
Next Story