Telugu Global
Cinema & Entertainment

హీరోను హలో బ్రదర్ అంటున్న బ్యూటీ...

సాధారణంగా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్, తన హీరోను బ్రదర్ అని పిలవదు. అలా పిలిస్తే సినిమా అస్సలు ఆడదు. ఎందుకంటే… హీరోహీరోయిన్లు మధ్య రొమాన్స్ పండినప్పుడు మాత్రమే సినిమా సక్సెస్ అవుతుంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బిరియాణి వాసనలా ఘుమఘుమలాడినప్పుడు మాత్రమే సినిమా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ హీరోయిన్ తన హీరోను అన్నయ్య… తమ్ముడు అంటూ తెగ పిలిచేస్తోంది. కానీ అదేంటో… అలా పిలవడం వల్లనే ఆ సినిమాకు క్రేజ్ వచ్చింది. అవును… […]

హీరోను హలో బ్రదర్ అంటున్న బ్యూటీ...
X

సాధారణంగా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్, తన హీరోను బ్రదర్ అని పిలవదు. అలా పిలిస్తే సినిమా అస్సలు ఆడదు. ఎందుకంటే… హీరోహీరోయిన్లు మధ్య రొమాన్స్ పండినప్పుడు మాత్రమే సినిమా సక్సెస్ అవుతుంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బిరియాణి వాసనలా ఘుమఘుమలాడినప్పుడు మాత్రమే సినిమా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ హీరోయిన్ తన హీరోను అన్నయ్య… తమ్ముడు అంటూ తెగ పిలిచేస్తోంది. కానీ అదేంటో… అలా పిలవడం వల్లనే ఆ సినిమాకు క్రేజ్ వచ్చింది. అవును… శ్రీరస్తు-శుభమస్తు సినిమా మేటర్ ఇది.

సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న అల్లు శిరీష్… లాంగ్ గ్యాప్ తర్వాత పరశురాం దర్శకత్వంలో శ్రీరస్తు-శుభమస్తు అనే సినిమా చేశాడు. ఈ సినిమా ట్రయిలర్ తాజాగా విడుదలైంది. సినిమాలో అల్లు శిరీష్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది. మరీ ముఖ్యంగా ట్రయిలర్… హీరోయిన్ మాటిమాటికి హీరోను తమ్ముడు అవుతాడు… అన్నయ్య అవుతాడు అంటూ ఆటపట్టించడం ట్రయిలర్ కే హైలెట్ గా నిలిచింది. మిగతాదంతా రొటీన్ వ్యవహారమే. తెలుగు సినిమాల్లో కామన్ కూడా చూసే సరకే కనిపించింది. కేవలం ఈ ఒక్క యాంగిల్ మాత్రమే ఎట్రాక్ట్ చేసింది జనాలకి. ఇక లుక్స్, యాక్టింగ్ పరంగా శిరీష్ ఓ 2 స్పూన్లు డెవలప్ అయితే… గ్లామర్ పరంగా లావణ్య ఓ మెట్టు పైకెక్కింది. గీతాఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 5న థియేటర్లలోకి రానుంది.

First Published:  27 July 2016 3:16 AM GMT
Next Story