Telugu Global
NEWS

ఆనం వారి జుగుప్సాకరమైన ఇంటర్వ్యూ

ఆయన వయసు 65ఏళ్లు. పలుదఫాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. సమాజానికి నీతులు చెబుతుంటారు. జగన్ లాంటి వారు మా రెడ్ల పరువు తీస్తున్నారంటూ ఫైర్‌ అవుతుంటారు. ఆయనే ఆనం వివేకానందరెడ్డి. అంతనీతులు చెప్పే అలాంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి?. చూస్తేనే దండం పెట్టేంతగా ఆయన ప్రవర్తన ఉండాలి. కానీ రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనం వివేకా ప్రవర్తనపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. అంతసీనియర్ నేత అయి ఉండి […]

ఆనం వారి జుగుప్సాకరమైన ఇంటర్వ్యూ
X

ఆయన వయసు 65ఏళ్లు. పలుదఫాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. సమాజానికి నీతులు చెబుతుంటారు. జగన్ లాంటి వారు మా రెడ్ల పరువు తీస్తున్నారంటూ ఫైర్‌ అవుతుంటారు. ఆయనే ఆనం వివేకానందరెడ్డి. అంతనీతులు చెప్పే అలాంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి?. చూస్తేనే దండం పెట్టేంతగా ఆయన ప్రవర్తన ఉండాలి. కానీ రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనం వివేకా ప్రవర్తనపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. అంతసీనియర్ నేత అయి ఉండి టీవీ యాంకర్ చెప్పినట్టు డాన్సులు వేయడం, చీరలు కట్టుకోవడం అత్యంత జుగుప్సాకరంగా అనిపించింది.

గతంలో చీరల షాప్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆనం అక్కడ ఒక చీరను చుట్టుకున్నారు. సరే సందర్భం కదాని నవ్వుకుని వదిలేశారు. కానీ ఇంటర్వ్యూ కోసం ఛానల్ ప్రతినిధి అడగమే ఆలస్యం ఏకంగా చీరల షాపుకు వెళ్లి అక్కడే చీరలు కట్టుకున్నారు ఆనం వివేకా. అంతేనా చూసేవాళ్లకే సిగ్గేసేలా లిప్ స్టిక్‌ రాసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఆనం ఒక బకరాలా ఛానల్‌ ప్రతినిధికి కనిపించారేమో గానీ… అప్పటికప్పుడు వేటగాడు సినిమాలో ఎన్టీఆర్‌ గెటప్ వేయించారు. ఆ డ్రస్‌ వేసుకుని గంగమ్ డ్యాన్స్ వేశారు 65ఏళ్ల ఆనం. ఇలా చీరలు కట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తే అది సున్నితమనసున్న వారి ప్రవర్తన అని సెలవిచ్చారు. మహిళలు కూడా సున్నితమనస్తత్వం ఉన్న వారు కాబట్టే అలా చీరలు కట్టుకుంటారని చెప్పారు. తనకు స్ల్పిట్‌ పర్సనాలిటీ ఉందని చెప్పుకున్నారు. కబాలి సినిమా చూశారో ఎమో గానీ ఇంటర్వ్యూలో పదేపదే బిగ్గరగా నవ్వడం, తాను సింగార పురుషుడిని అని చెప్పుకోవడం ఇలా రకరకాలుగా ప్రవర్తించారు. టీవీ ప్రతినిధిని ఎంటర్‌టైన్ చేయడం కోసమే అన్నట్టుగా ఆనం ప్రవర్తించారు. మొత్తం మీద సదరు ఇంటర్వ్యూ చూసిన తర్వాత జనం ఆనం మరీ ఇంత చీపా అని అనుకోవడం మాత్రం ఖాయం.

Click on Image to Read:

chandrababu-boyapati-sinu

chandrababu-pakistan

babu-jagan

singger sunitha

sunitha

ys-jagan

suresh-babu

jagan-praveen-kumar-reddy

tirupati-asp-sidda-reddy

mahanandi-reddy--murder-pla

chandrababi-toiltes

ongole-ysrcp-Mayo-shamantha

peddi-reddy-dwarakanath

lokesh-1

First Published:  26 July 2016 3:40 AM GMT
Next Story