Telugu Global
Cinema & Entertainment

మ‌న‌మంతా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం మనమంతా. ఆగస్టు 5న విడుదల కాబోతున్నఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. మధ్యతరగతి జీవుల జీవితాన్ని ప్రతిబింభిస్తూ తెరకెక్కించిన ఈ మూవీ మనం నిత్య జీవితంలో రోజూ చూసే అంశాల చుట్టూ ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని […]

మ‌న‌మంతా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
X

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం మనమంతా. ఆగస్టు 5న విడుదల కాబోతున్నఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. మధ్యతరగతి జీవుల జీవితాన్ని ప్రతిబింభిస్తూ తెరకెక్కించిన ఈ మూవీ మనం నిత్య జీవితంలో రోజూ చూసే అంశాల చుట్టూ ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది.

ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్ ను పొందింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా ఆగ‌స్టు 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. సీనియ‌ర్ న‌టి గౌత‌మి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు. మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నలుగురు వ్యక్తుల ప్రయాణమే మ‌న‌మంతా. క‌చ్చితంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.త్వ‌ర‌లో సినిమా రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తున్నారు.

First Published:  23 July 2016 5:51 AM GMT
Next Story