Telugu Global
Cinema & Entertainment

షాకింగ్... జనతా గ్యారేజ్ వాయిదా?

సినిమా సెట్స్ పైకి వచ్చిన వారం రోజుల నుంచే విడుదల తేదీపై చాలా హంగామా చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్ట్ 12న బొమ్మను ధియేటర్లలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. కానీ జనతా గ్యారేజీ టీం మాత్రం బంగారం లాంటి వీకెండ్ ను మిస్ చేసుకుంది. ఆగస్ట్ 12, 13, 14, 15… ఇలా వరుసగా 4 రోజులు వీకెండ్ మూడ్ లో ఉంటారు జనాలు. ఇలాంటి టైమ్ లో సినిమా విడుదలైతే… కాసుల పండగే. అందుకే రెస్ట్ లేకుండా […]

షాకింగ్... జనతా గ్యారేజ్ వాయిదా?
X
సినిమా సెట్స్ పైకి వచ్చిన వారం రోజుల నుంచే విడుదల తేదీపై చాలా హంగామా చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్ట్ 12న బొమ్మను ధియేటర్లలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. కానీ జనతా గ్యారేజీ టీం మాత్రం బంగారం లాంటి వీకెండ్ ను మిస్ చేసుకుంది. ఆగస్ట్ 12, 13, 14, 15… ఇలా వరుసగా 4 రోజులు వీకెండ్ మూడ్ లో ఉంటారు జనాలు. ఇలాంటి టైమ్ లో సినిమా విడుదలైతే… కాసుల పండగే. అందుకే రెస్ట్ లేకుండా ఇన్నాళ్లూ జనతా గ్యారేజ్ షూటింగ్ చేశాడు ఎన్టీఆర్. లాంగ్ వీకెండ్ లో వచ్చి వసూళ్ల సునామీ సృష్టిద్దామనుకున్నాడు. కానీ అతడి ఆశలు ఇప్పుడు నెరవేరేలా కనిపించడం లేదు.
తాజా సమాచారం ప్రకారం జనతా గ్యారేజీ సినిమా అనుకున్న టైమ్ కు రాకపోవచ్చు. ఆగస్ట్ 12న కాకుండా… ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారట. దీనికి కారణం షూటింగ్ లో జాప్యమే. నిజానికి ఎడతెగకుండా షూటింగ్ చేసినప్పటికీ… సినిమాకు సంబంధించి తీయాల్సిన సన్నివేశాలు ఇంకా చాలానే ఉన్నాయట. అవన్నీ పూర్తవ్వడం కష్టమనే తెలుస్తోంది. అందుకే హర్రీబర్రీగా సినిమాను చుట్టేసి థియేటర్లలోకి వచ్చే కంటే… ఆగస్ట్ ను వదులుకోవడమే బెటరని టీం భావిస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
First Published:  15 July 2016 5:33 AM GMT
Next Story