Telugu Global
Cinema & Entertainment

వెంకటేశ్ సినిమా మరోసారి వాయిదా...?

వెంకటేష్ సినిమాను ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. మే నెలలోనే సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను కనీసం ఈనెలలో కూడా విడుదల చేయలేకపోతున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం… సినిమా రిలీజ్ వచ్చేనెలకు పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. లెక్కప్రకారం… ఈ నెల్లోనే బాబు బంగారం విడుదల కావాలి. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, ఈనెల 29న బాబు బంగారాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ టైమ్ కు రజనీకాంత్ […]

వెంకటేశ్ సినిమా మరోసారి వాయిదా...?
X

వెంకటేష్ సినిమాను ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. మే నెలలోనే సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను కనీసం ఈనెలలో కూడా విడుదల చేయలేకపోతున్నారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం… సినిమా రిలీజ్ వచ్చేనెలకు పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. లెక్కప్రకారం… ఈ నెల్లోనే బాబు బంగారం విడుదల కావాలి. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, ఈనెల 29న బాబు బంగారాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ టైమ్ కు రజనీకాంత్ నటిస్తున్న కబాలి విడుదలకు సిద్ధమైంది. మొన్నటివరకు ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ ఉండేది. కానీ, అది 29కి రావడం దాదాపు ఖాయమని తేలిపోవడంతో బాబు బంగారాన్ని ఆగస్ట్ కు వాయిదా వేశారు. అయితే వచ్చే నెలలో జనతా గ్యారేజ్ తో తారక్ సిద్ధంగా ఉన్నాడు. ఆగస్ట్ 12న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. సో.. ఆ టైమ్ లో బాబు బంగారాన్ని విడుదల చేయడం అస్సలు మంచిదికాదని వెంకీ భావిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం… బాబు బంగారం సినిమాను ఆగస్ట్ 26కు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సరిగ్గా నెల రోజుల పాటు సినిమా విడుదల వాయిదా పడిందన్నమాట. త్వరలోనే దీనిపై అధికారింగా ఓ ప్రకటన రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాబు బంగారం సినిమాలో వెంకీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో… మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి.

First Published:  11 July 2016 3:59 AM GMT
Next Story