Telugu Global
Cinema & Entertainment

దసరాకి ధృవ విడుదల‌

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. అసలు టైటిల్ ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఈ టైటిల్ ను అధికారికంగా ఎనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎటొచ్చీ మరో నెల రోజుల్లో ఈ సస్పెన్స్ వీడిపోనుంది. మెగాఫ్యాన్స్ కు చెర్రీ తన సినిమాకు సంబంధించి గిఫ్ట్ అందించబోతున్నాడు. అది కూడా ఓ ప్రత్యేకమైన రోజున ఆ కానుక అందనుంది. అవును… వచ్చేనెలలో చిరంజీవి పుట్టినరోజు […]

దసరాకి ధృవ విడుదల‌
X

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. అసలు టైటిల్ ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఈ టైటిల్ ను అధికారికంగా ఎనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎటొచ్చీ మరో నెల రోజుల్లో ఈ సస్పెన్స్ వీడిపోనుంది. మెగాఫ్యాన్స్ కు చెర్రీ తన సినిమాకు సంబంధించి గిఫ్ట్ అందించబోతున్నాడు. అది కూడా ఓ ప్రత్యేకమైన రోజున ఆ కానుక అందనుంది. అవును… వచ్చేనెలలో చిరంజీవి పుట్టినరోజు ఉంది. ఆ రోజున.. అంటే ఆగస్ట్ 22న ధ్రువ సినిమా టీజర్ ను, అధికారిక టైటిల్ ను విడుదల చేయాలని చరణ్ నిర్ణయించాడు. ఇక సెప్టెంబర్ 2న ఆడియోను లాంచ్ చేసి… అక్టోబర్ 7న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం ధ్రువ సినిమా షూటింగ్ శరవేకంగా సాగుతోంది. ఇటీవలే జమ్ముకశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసిన చెర్రీ టీం… ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఓ భారీ షెడ్యూల్ ను నడిపిస్తోంది. ఒకప్పుడు కలల హీరోగా చలామణి అయిన అరవింద్ స్వామి.. ఈ సినిమాతో తెలుగుతెరకు విలన్ గా పరిచయం అవుతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను… తమిళ్ లో హిట్టయిన థని ఒరువన్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. మూవీలో రామ్ చరణ్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా… మరో కీలక పాత్రలో నవదీప్ కనిపించనున్నాడు.

First Published:  8 July 2016 11:22 PM GMT
Next Story