Telugu Global
Cinema & Entertainment

స‌ల్మాన్ దండ యాత్ర  ఎన్ని కోట్ల‌కు వెళ్తుందో..! 

ఈ రంజాన్ స‌ల్మాన్ అభిమానుల‌కు  డ‌బుల్ ధ‌మాక అనే చెప్పాలి.   సుల్తాన్ చిత్రంతో  స‌ల్మాన్ ఖాన్  బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు.  ప్ర‌పంచ వ్యాప్తంగా  దాదాపు  వేల స్క్రీన్స్ లో విడుద‌లైన  సుల్తాన్ చిత్రం   బుధ‌వారం   ప్ర‌పంచ వ్యాప్తంగా  రిలీజ్ అయ్యింది.  మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ విష‌యంలో  కూడా   ఈ చిత్రం  రికార్డులు క్రియోట్ చేసిన‌ట్లు గా  ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ టాక్.   బాలీవుడ్ లో  ఇప్ప‌టి వ‌ర‌కు  మొద‌టి […]

స‌ల్మాన్ దండ యాత్ర  ఎన్ని కోట్ల‌కు వెళ్తుందో..! 
X
ఈ రంజాన్ స‌ల్మాన్ అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాక అనే చెప్పాలి. సుల్తాన్ చిత్రంతో స‌ల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు వేల స్క్రీన్స్ లో విడుద‌లైన సుల్తాన్ చిత్రం బుధ‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ విష‌యంలో కూడా ఈ చిత్రం రికార్డులు క్రియోట్ చేసిన‌ట్లు గా ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ టాక్. బాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ విష‌యంలో 100 కోట్లు మాత్ర‌మే ఉంది. ఆ రికార్డ్ ను సుల్తాన్ చిత్రం బ‌ద్ద‌లు చేసింద‌నేది స‌మాచారం. ఫస్ట్ డే ఈ చిత్రం దాదాపు 130 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు తెలుస్తుంది.
సినిమాను ద‌ర్శ‌కుడు అబ్బాస్ మాస్తాన్ ఎమోష‌న‌ల్ గా క‌థ‌నం చేయ‌డంలో నూటికి నూరు శాతం స‌క్సెస్ కావ‌డంతో… సినిమా ఆబాల గోపాల‌ని అల‌రిస్తుంది. ఇదే జోరు రెండు వారాలు కొన సాగిన సుల్తాన్ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 8 వంద‌ల కోట్లు క‌లెక్ట్ చేయ‌డం గ్యారంటీ అనేది ట్రేడ్ ఎక్స్ ప‌ర్ట్స్ టాక్. స‌ల్మాన్ ఖాన్, అనుష్క శ‌ర్మ‌, ర‌ణ‌దీప్ హుడాలు ప్ర‌ధాన పాత్ర‌లు చేసిన ఈ స్టోర్ట్ డ్రామా కు వేరే చిత్రాలు ఏవి పోటి లేక‌పోవ‌డం కూడా క‌లెక్ష‌న్ల ప‌రంగా ప్ల‌స్ పాయింటే.
First Published:  7 July 2016 11:16 PM GMT
Next Story