Telugu Global
Cinema & Entertainment

జబర్దస్త్ భామను మోసం చేసిన దర్శకుడు

జబర్దస్త్ భామ రేష్మి గౌతమ్ ఎప్పుడో హీరోయిన్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె నటించిన గుంటూరు టాకీస్ చిత్రం రేష్మికి మంచి పేరే తీసుకొచ్చింది. అందాల ఆరబోతలో తనదైన స్టయిల్ దూసుకుపోతున్న ఈ చిన్నది తాజాగా అంతం అనే మరో సినిమా చేసింది. కేవలం రేష్మి అందాలతోనే ఈ సినిమాకు ప్రచారం దక్కింది. దీంతో ఈ చిత్రం పై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్ళారు . తీరా సినిమాలోకి వెళ్లి చూస్తే బుక్కయ్యాయమనే విషయం […]

జబర్దస్త్ భామను మోసం చేసిన దర్శకుడు
X

జబర్దస్త్ భామ రేష్మి గౌతమ్ ఎప్పుడో హీరోయిన్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె నటించిన గుంటూరు టాకీస్ చిత్రం రేష్మికి మంచి పేరే తీసుకొచ్చింది. అందాల ఆరబోతలో తనదైన స్టయిల్ దూసుకుపోతున్న ఈ చిన్నది తాజాగా అంతం అనే మరో సినిమా చేసింది. కేవలం రేష్మి అందాలతోనే ఈ సినిమాకు ప్రచారం దక్కింది. దీంతో ఈ చిత్రం పై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్ళారు . తీరా సినిమాలోకి వెళ్లి చూస్తే బుక్కయ్యాయమనే విషయం అర్థం చేసుకున్నారు. సినిమాలో రేష్మి పాత్ర చాలా చిన్నది. ట్రయిలర్ లో చూపించిన ఆ మెరుపులు తప్ప ఇంకేం లేవు. ప్రమోషన్ లో మాత్రం ”ఇంటికి రా ……స్వర్గం చూపిస్తా ” అంటూ రేష్మి చెప్పే హాట్ డైలాగ్ ని బాగా ప్రచారం చేయడంతో ,దానికి తోడూ రేష్మి గ్లామర్ ని మరోసారి వీక్షిద్దామని వెళ్ళిన వాళ్ళు సినిమా చూసి షాక్ తిన్నారు. దీనిపై రేష్మి కూడా స్పందించింది. దర్శకుడు తనను మోసం చేశాడని ఆరోపించింది. తనకు క్రేజ్ లేనప్పడు అప్పుడెప్పుడో చాలా ఏళ్ల కిందట అంతం సినిమా తీశారని… ఇప్పుడు తనకు క్రేజ్ వచ్చింది కాబట్టి… కేవలం తన సీన్లు మాత్రమే పెట్టి ట్రయిలర్ కట్ చేసి ప్రేక్షకుల్ని మోసం చేశారని రేష్మి ఆరోపిస్తోంది. తన పాత్ర చాలా చిన్నదైనా… తననే హైలెట్ చేసిన ట్రయిలర్స్ లో చూపించడంతో ప్రేక్షకులు మోసపోతున్నారని.. ఇందులో తన తప్పు లేదని వేడుకుంటోంది ఈ జబర్దస్త్ భామ.

First Published:  8 July 2016 6:32 AM GMT
Next Story