Telugu Global
National

సినిమాలో న‌టించ‌నున్న అచ్యుతానంద‌న్ 

కేర‌ళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానంద‌న్ ఒక మ‌ల‌యాళీ సినిమాలో న‌టించ‌నున్నారు. ఆ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే కేర‌ళ‌లో ప్రారంభం కానుంది. అనేక పోరాటాల్లో పాల్లొని, వేలాది స‌మావేశాల్లో ప్ర‌సంగించిన సీపీఐ(ఎం) సీనియ‌ర్ నేత అచ్యుతానంద‌న్ సామాజిక స‌మ‌స్య‌ల‌పై నిర్మిస్తున్న ఆ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నారు. త‌న సినిమాలో అచ్యుతానంద‌న్ పాత్ర‌నే చాలా ముఖ్య‌మైన‌ద‌ని, ఆ పాత్ర‌లో మ‌రొక‌రిని ఊహించుకోలేమ‌ని ఈ చిత్ర ద‌ర్శ‌కుడు జీవ‌న్‌దాస్ పేర్కొన్నారు. త‌న సినిమాలో అచ్యుతానంద‌న్ న‌టించ‌డాన్ని గొప్ప […]

సినిమాలో న‌టించ‌నున్న అచ్యుతానంద‌న్ 
X
కేర‌ళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానంద‌న్ ఒక మ‌ల‌యాళీ సినిమాలో న‌టించ‌నున్నారు. ఆ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే కేర‌ళ‌లో ప్రారంభం కానుంది. అనేక పోరాటాల్లో పాల్లొని, వేలాది స‌మావేశాల్లో ప్ర‌సంగించిన సీపీఐ(ఎం) సీనియ‌ర్ నేత అచ్యుతానంద‌న్ సామాజిక స‌మ‌స్య‌ల‌పై నిర్మిస్తున్న ఆ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నారు. త‌న సినిమాలో అచ్యుతానంద‌న్ పాత్ర‌నే చాలా ముఖ్య‌మైన‌ద‌ని, ఆ పాత్ర‌లో మ‌రొక‌రిని ఊహించుకోలేమ‌ని ఈ చిత్ర ద‌ర్శ‌కుడు జీవ‌న్‌దాస్ పేర్కొన్నారు. త‌న సినిమాలో అచ్యుతానంద‌న్ న‌టించ‌డాన్ని గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్‌లో విడుద‌లయ్యే అవ‌కాశమున్న‌ద‌ని ఆ ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు.
First Published:  7 July 2016 3:30 PM GMT
Next Story