Telugu Global
Cinema & Entertainment

బాబు బంగారం ఆడియో రిలీజ్ వాయిదా

విక్ట‌రీ వెంక‌టేష్ , న‌య‌న‌తార లీడ్ రోల్స్ లో   ద‌ర్శ‌కుడు   మారుతీ చేస్తున్న బాబు బంగారం చిత్రం ఆడియో రిలీజ్  వాయిదా ప‌డింది. ఈ నెల 9 న  జీబ్రాన్ అందించిన  సింగిల్ ట్రాక్ మాత్రం రిలీజ్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు  మారుతి ట్విట్ చేశారు.   వాస్త‌వంగా ఈ నెల 9న  భారీగా  ఆడియో రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ  కొన్ని కారాణాల వ‌ల్ల ఆడియో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్న‌ట్లు  తెలిపారు. సితార ఎంట‌ర్ టైన్ […]

బాబు బంగారం ఆడియో రిలీజ్ వాయిదా
X

విక్ట‌రీ వెంక‌టేష్ , న‌య‌న‌తార లీడ్ రోల్స్ లో ద‌ర్శ‌కుడు మారుతీ చేస్తున్న బాబు బంగారం చిత్రం ఆడియో రిలీజ్ వాయిదా ప‌డింది. ఈ నెల 9 న జీబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ మాత్రం రిలీజ్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు మారుతి ట్విట్ చేశారు. వాస్త‌వంగా ఈ నెల 9న భారీగా ఆడియో రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారాణాల వ‌ల్ల ఆడియో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

సితార ఎంట‌ర్ టైన్ మెంట్ పై ప్ర‌ముఖ నిర్మాత ఎన్ రాధాకృష్ణ ( చినబాబు) స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం వ‌స్తుంది. దీనిక సంబంధించి టీజ‌ర్ కు అన్ని వ‌ర్గాల నుంచి మంచి స్పంద‌న రావ‌డంతో చిత్ర యూనిట్ చాలా పాజిటివ్ గా వున్నారు. బ్ర‌హ్మ‌నందం, షావుకారు జానికి, పోసాని కృష్ణ ముర‌ళి, పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్, ర‌ఘుబాబు , బ్ర‌హ్మాజి, సంప‌త్ , ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్, మున్నావేణు, గిరిధ‌ర్, అనంత్, రాజా ర‌వింద్రాలు ఇత‌ర రోల్స్లో నటిస్తున్నారు. వెంక‌టేష్ సినిమా అంటే ఆడియ‌న్స్ లో వుండే ఎంట‌ర్ టైన మెంట్ తో పాటు.. యూత్ ఆడియ‌న్స్ ను క‌ట్టి ప‌డిసేలా ఈ చిత్రం వుంటుంది అనేది డైరెక్ట‌ర్ మారుతి మాట‌. త‌దుప‌రి ఆడియో రిలీజ్ వేడుక ఎప్పుడు అనేది త్వ‌ర‌లోనే చెబుతామ‌ని తెలిపారు.

First Published:  6 July 2016 9:00 PM GMT
Next Story