Telugu Global
National

ఆనంద్ బెన్‌ను తొల‌గించే ధైర్యం మోడీకి లేదా?

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ఆనంద్‌బెన్ ప‌టేల్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొలగించే ధైర్యం ప్ర‌ధాని మోడీకి, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షాకు లేదా? అనే ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో చాలా కాలంగా సాగుతోంది. గుజ‌రాత్‌లో ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మాన్ని అణ‌చి వేయ‌డంలో ఆనంద్ బెన్ విఫ‌ల‌మ‌య్యార‌ని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ కార‌ణంగానే ఆమెను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని మోడీ యోచిస్తున్నారు. దీని కోసం ఆయ‌న స‌రైనా సాకు కోసం అన్వేషిస్తున్నారు. ఆయ‌న‌కు ఇటీవ‌ల వ‌యస్సు మీరిన వారిని […]

ఆనంద్ బెన్‌ను తొల‌గించే ధైర్యం మోడీకి లేదా?
X
గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ఆనంద్‌బెన్ ప‌టేల్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొలగించే ధైర్యం ప్ర‌ధాని మోడీకి, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షాకు లేదా? అనే ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో చాలా కాలంగా సాగుతోంది. గుజ‌రాత్‌లో ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మాన్ని అణ‌చి వేయ‌డంలో ఆనంద్ బెన్ విఫ‌ల‌మ‌య్యార‌ని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ కార‌ణంగానే ఆమెను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని మోడీ యోచిస్తున్నారు. దీని కోసం ఆయ‌న స‌రైనా సాకు కోసం అన్వేషిస్తున్నారు. ఆయ‌న‌కు ఇటీవ‌ల వ‌యస్సు మీరిన వారిని ప‌ద‌వుల నుంచి తొలగించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదే సాకుతో అనంద్‌బెన్‌ను తొల‌గించాల‌ని అనుకున్నారు.వివిధ కార‌ణాల వ‌ల్ల అది సాధ్యం కాలేదు. అయితే 75 సంవ‌త్స‌రాల పైబ‌డిన వారిని కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించాల‌ని మోడీ నిర్ణ‌యించారు. కొంత మందిని ఇదే సాకుతో త‌న మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించారు.
కానీ క‌ల్‌రాజ్ మిశ్రా విష‌యంలో మాత్రం అలా చేయ‌లేక పోయారు. దీనికి కార‌ణం ఆయ‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన బ్రాహ్మ‌ణ కులానికి చెందిన వారు కావ‌డ‌మే. యూపీలో 9 శాతం మంది బ్రాహ్మ‌ణులున్నారు. దీంతో మిశ్రాను తొల‌గిస్తే ఆయ‌న సామాజిక వ‌ర్గం నుంచి వ్య‌తిరేక‌త రావ‌చ్చ‌ని మోడీ భ‌య‌ప‌డ్డారు. అయితే మిశ్రాకు 75 సంవ‌త్స‌రాలు పైబ‌డి ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌నను తొల‌గించ‌క పోవ‌డం ఆనంద్‌బెన్‌కు క‌లిసి వ‌చ్చింద‌ని గుజ‌రాత్ సీఎం వ‌ర్గానికి చెందిన ఒక మంత్రి పేర్కొన్నారు. గుజ‌రాత్‌ను ఆనంద్‌బెన్‌ను తొల‌గిస్తే ప‌టేళ్లు మ‌రింత దూరం అవుతార‌నే భ‌యం మోడీని పీడిస్తున్న‌ద‌ని కూడా కొంత మంది చెబుతున్నారు. 2017లో ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆనంద్ బెన్‌ను సీఎం ప‌ద‌వి నుంచి మోడీ తొల‌గించ‌క పోవ‌చ్చ‌ని రాజకీయ ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. అందువ‌ల్ల మోడీకి ముఖ్య‌మంత్రి ఆనంద్‌బెన్‌ను తొలగించే ద‌మ్ము, ధైర్యం లేవ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస గుస లాడుతున్నారు.
First Published:  6 July 2016 8:01 PM GMT
Next Story