Telugu Global
Cinema & Entertainment

అనుష్క అప్పుడే సన్యాసినిగా మారిపోయింది...

త్వరలోనే సన్యాసిని పాత్రలో అనుష్క కనిపించనుందనే వార్తలు గతంలో హల్ చల్ చేశాయి. నాగార్జున నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ సినిమాలో అనుష్క ఈ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఈమధ్యే ప్రారంభమైంది. నాగార్జునపై తొలి షాట్ పిక్చరైజ్ చేశారు. ఇక అనుష్క త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని అంతా ఎదురుచూస్తున్న సమయంలో…. అందరికంటే ముందే సెట్స్ పై ప్రత్యక్షమైంది బొమ్మాళి. ఓం నమో వేంకటేశాయ తొలి షెడ్యూల్ లోనే అనుష్క ఎంట్రీ ఇచ్చింది. సన్యాసిని […]

అనుష్క అప్పుడే సన్యాసినిగా మారిపోయింది...
X

త్వరలోనే సన్యాసిని పాత్రలో అనుష్క కనిపించనుందనే వార్తలు గతంలో హల్ చల్ చేశాయి. నాగార్జున నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ సినిమాలో అనుష్క ఈ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఈమధ్యే ప్రారంభమైంది. నాగార్జునపై తొలి షాట్ పిక్చరైజ్ చేశారు. ఇక అనుష్క త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని అంతా ఎదురుచూస్తున్న సమయంలో…. అందరికంటే ముందే సెట్స్ పై ప్రత్యక్షమైంది బొమ్మాళి. ఓం నమో వేంకటేశాయ తొలి షెడ్యూల్ లోనే అనుష్క ఎంట్రీ ఇచ్చింది. సన్యాసిని పాత్రలో హథీరాం బాబాగా నటిస్తున్న నాగార్జునతో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించింది. ఈ సీన్లు చాలా చక్కగా వచ్చాయని యూనిట్ సభ్యులు తెలిపారు. సినిమాలో అనుష్క పాత్ర కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ 10 నిమిషాలకు సంబంధించిన సన్నివేశాల్ని తొలి షెడ్యూల్ లోనే పూర్తిచేయాలని నిర్ణయించారు. అనుష్క కూడా అందుకే తొలి షెడ్యూల్ లోనే ప్రత్యక్షమైంది. ఎందుకంటే… తర్వాత ఆమె మళ్లీ బాహుబలి-2 సెట్స్ లో జాయిన్ అవ్వాలి. అక్కడ ఎంట్రీ ఇస్తే మళ్లీ మరో సినిమా సెట్స్ లోకి ప్రవేశించడం చాలా కష్టం. అందుకే కాస్త ముందుగానే నాగార్జున సినిమాను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో… తొలి షెఢ్యూల్ లోనే అనుష్క ప్రత్యక్షమైంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత…. హీరోయిన్లు విమలా రామన్, ప్రగ్యా జైశ్వాల్ సెట్స్ లోకి చేరతారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

First Published:  5 July 2016 12:35 AM GMT
Next Story