Telugu Global
Cinema & Entertainment

సైమాలో సందడి చేసిన విక్రమ్

నిజానికి సైమా వేడుకలకు విక్రమ్ వెళ్లలేదు. కానీ విక్రమ్ లేకపోయినా అతడి హంగామా మాత్రం సైమాను ఊపేసింది. దీనికి కారణం విక్రమ్ తాజా చిత్రం. అవును… విక్రమ్ నటిస్తున్న విలక్షణ సినిమా ఇరు ముగన్.. ట్రయిలర్ ను సైమాలో లాంఛ్ చేశారు. సింగపూర్ లో జరిగిన సైమా వేడుకల్లో ఇరు ముగన్ సినిమా తెలుగు ట్రయిలర్ ను లాంఛ్ చేయడం విశేషం. ఈ సినిమా తెలుగు టైటిల్ ను ఇంకొక్కడు అని ఫిక్స్ చేశారు. విక్రమ్, నయనతార, […]

సైమాలో సందడి చేసిన విక్రమ్
X

నిజానికి సైమా వేడుకలకు విక్రమ్ వెళ్లలేదు. కానీ విక్రమ్ లేకపోయినా అతడి హంగామా మాత్రం సైమాను ఊపేసింది. దీనికి కారణం విక్రమ్ తాజా చిత్రం. అవును… విక్రమ్ నటిస్తున్న విలక్షణ సినిమా ఇరు ముగన్.. ట్రయిలర్ ను సైమాలో లాంఛ్ చేశారు. సింగపూర్ లో జరిగిన సైమా వేడుకల్లో ఇరు ముగన్ సినిమా తెలుగు ట్రయిలర్ ను లాంఛ్ చేయడం విశేషం. ఈ సినిమా తెలుగు టైటిల్ ను ఇంకొక్కడు అని ఫిక్స్ చేశారు. విక్రమ్, నయనతార, నిత్యమీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుడు. ‘ఇంకొక్కడు’ పేరుతో ఈ సినిమా తెలుగులో విడుదల కానుందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ వార్తని ధృవీకరించిన చిత్ర బృందం సింగపూర్‌లోని సైమా వేడుకల్లో తెలుగు టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ టీజర్‌ని విడుదల చేశారు. ‘’ఐ’ చిత్రం తర్వాత సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు విక్రమ్‌…. ఇప్పుడు ఇంకొక్కడు సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరీ ముఖ్యంగా టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై విక్రమ్ మరిన్ని హోప్స్ పెంచుకున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తమిళంలో ఇప్పటికే భారీ క్రేజ్‌ ఉంది. సెప్టెంబర్‌ 5న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఇంకొక్కడు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published:  2 July 2016 2:44 AM GMT
Next Story