Telugu Global
Cinema & Entertainment

అఖిల్ ప్రేమాయణంపై ఆంగ్లపత్రిక కథనం

నాగ చైతన్య, సమంతల ప్రేమాయణం గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం మరువకముందే ఇప్పుడు అఖిల్‌ ప్రేమ గురించి ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా వార్తను ప్రచురించింది. అఖిల్‌ ప్రేమిస్తున్న అమ్మాయి పేరు “శ్రీయా భూపాల్‌” అని ఆమె ప్రముఖ ష్యాషన్‌ డిజైనరని పత్రిక వెల్లడించింది. ఈమే పలువురు ప్రముఖ బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోయిన్‌లకు  డిజైనర్ గా పనిచేసింది.  అక్కినేని కుటుంబంతో శ్రీయా భూపాల్‌ కుటుంబానికి ఎప్పటినుంచో స్నేహం వుందని తెలిపింది. ఈ స్నేహమే […]

అఖిల్ ప్రేమాయణంపై ఆంగ్లపత్రిక కథనం
X

నాగ చైతన్య, సమంతల ప్రేమాయణం గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం మరువకముందే ఇప్పుడు అఖిల్‌ ప్రేమ గురించి ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా వార్తను ప్రచురించింది. అఖిల్‌ ప్రేమిస్తున్న అమ్మాయి పేరు “శ్రీయా భూపాల్‌” అని ఆమె ప్రముఖ ష్యాషన్‌ డిజైనరని పత్రిక వెల్లడించింది. ఈమే పలువురు ప్రముఖ బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోయిన్‌లకు డిజైనర్ గా పనిచేసింది.

అక్కినేని కుటుంబంతో శ్రీయా భూపాల్‌ కుటుంబానికి ఎప్పటినుంచో స్నేహం వుందని తెలిపింది. ఈ స్నేహమే అఖిల్‌, శ్రీయల మధ్య ప్రేమ చిగురించిందకు మరోకారణం అని పత్రిక వెల్లడించింది. ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.

శ్రీయా భూపాల్ తండ్రి కొన్నేళ్ల క్రితమే క్యాన్సర్‌ తో చనిపోయారు. రెండేళ్ల క్రితం “శ్రీయా సమ్‌” లేబుల్‌ కలక్షన్‌ “ఎబ్‌ అండ్‌ ఫ్లో”ని ప్రారంభించారు శ్రీయా భూపాల్‌.

First Published:  28 Jun 2016 12:43 PM GMT
Next Story