Telugu Global
Cinema & Entertainment

నాని బ్యూటీపై ఎన్టీఆర్ కన్ను

జెంటిల్ మన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదా థామస్ ఒక్కసారిగా తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. ఆమె అందం, అభినయానికి ప్రశంసలే కాదు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది. దీంతో ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఆకర్షించిన ఈ మలయాళ కుట్టికి ఇప్పుడు మంచి ఆఫర్లు ఆహ్వానం పలుకుతున్నాయి. మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్… నివేదా థామస్ పై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాడట.  ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల […]

నాని బ్యూటీపై ఎన్టీఆర్ కన్ను
X
జెంటిల్ మన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదా థామస్ ఒక్కసారిగా తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. ఆమె అందం, అభినయానికి ప్రశంసలే కాదు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది. దీంతో ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఆకర్షించిన ఈ మలయాళ కుట్టికి ఇప్పుడు మంచి ఆఫర్లు ఆహ్వానం పలుకుతున్నాయి. మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్… నివేదా థామస్ పై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాడట.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండటంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను తొందరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ లో ఉన్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో ఓ హీరోయిన్ పాత్రకు నివేదా థామస్ ను తీసుకుందామని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. తాజాగా ‘జెంటిల్ మన్’ సినిమాలో నివేదా పెర్ఫార్మెన్స్ చూసి ఎన్టీఆర్ ఫిదా అయినట్టు తెలుస్తోంది. పైగా తన నెక్ట్స్ సినిమాలో స్వతహాగా మలయాళ అమ్మాయి అయిన నివేదాను హీరోయిన్ గా పెట్టుకుంటే మలయాళంలోనూ తన సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జనతా గ్యారేజీ సినిమా కచ్చితంగా మలయాళంలో కూడా ఆడుతుంది. ఎందుకంటే అందులో మోహన్ లాల్ ఉన్నాడు. నిత్యామీనన్ కూడా ఉంది. ఆ వెంటనే విడుదలకానున్న సినిమాలో నివేదాను పెట్టుకుంటే బాగుంటుందనేది తారక్ ప్లాన్.
First Published:  26 Jun 2016 10:33 PM GMT
Next Story