Telugu Global
Cinema & Entertainment

జనతా గ్యారేజీ షూటింగ్ అప్ డేట్స్

ఏకథాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ జనతా గ్యారేజీ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఆగస్ట్ 12కు విడుదల చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. వచ్చేనెల 6న సినిమా టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జులై ఆఖరి వారంలో ఆడియోను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే…. జనతా గ్యారేజీలో మొత్తం 6 పాటలుంటే… ఇప్పటికే 2 పాటల షూటింగ్ ను కంప్లీట్ చేశారు. మిగిలిన 4 పాటల్లో […]

జనతా గ్యారేజీ షూటింగ్ అప్ డేట్స్
X
ఏకథాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ జనతా గ్యారేజీ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఆగస్ట్ 12కు విడుదల చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. వచ్చేనెల 6న సినిమా టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. జులై ఆఖరి వారంలో ఆడియోను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే…. జనతా గ్యారేజీలో మొత్తం 6 పాటలుంటే… ఇప్పటికే 2 పాటల షూటింగ్ ను కంప్లీట్ చేశారు. మిగిలిన 4 పాటల్లో ఒక పాటను శ్రీలంక రాజధాని కొలంబోలో షూట్ చేయాలని భావిస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ ఇదే ఉండబోతోంది. ఆ వెంటనే విదేశాలకు వెళ్లి… మరో 2 పాటలు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు.
సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత తారక్ నటిస్తున్న మూవీ కావడంతో… జనతా గ్యారేజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అటు కొరటాల శివ కూడా శ్రీమంతుడుతో పెద్ద సక్సెస్ అందుకోవడంతో… మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్ట్ 12 టైమ్ లో … భారీ వీకెండ్ వచ్చిన కారణంగా… ఆ తేదీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తారక్ కెరీర్ లోనే భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా జనతా గ్యారేజీ ఇప్పటికే రికార్డు సృష్టించింది.
First Published:  26 Jun 2016 9:58 PM GMT
Next Story