Telugu Global
Cinema & Entertainment

కూతురుకు పెళ్లి చేయబోతున్న విక్రమ్...

ఈ న్యూస్ బయటకు వచ్చేంత వరకు విక్రమ్ కు అంత పెద్ద కూతురు ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కానీ ఇదినిజం. త్వరలోనే విక్రమ్… తన కూతురుకు పెళ్లి చేయబోతున్నాడు. చియాన్ కూతురు అక్షిత, మను రంజిత్ అనే కుర్రాడితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని మను రంజిత్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అటు చియాన్ కూడా ఈ సంబంధంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అక్షిత పట్టుబట్టడంతో… ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయి. […]

కూతురుకు పెళ్లి చేయబోతున్న విక్రమ్...
X
ఈ న్యూస్ బయటకు వచ్చేంత వరకు విక్రమ్ కు అంత పెద్ద కూతురు ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కానీ ఇదినిజం. త్వరలోనే విక్రమ్… తన కూతురుకు పెళ్లి చేయబోతున్నాడు. చియాన్ కూతురు అక్షిత, మను రంజిత్ అనే కుర్రాడితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని మను రంజిత్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అటు చియాన్ కూడా ఈ సంబంధంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అక్షిత పట్టుబట్టడంతో… ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయి. త్వరలోనే చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో అక్షిత-రంజిత్ ల నిశ్చితార్థ వేడుక ఉండబోతోంది. వచ్చే ఏడాది వీళ్లిద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారు.
Hero-Vikram-Family-5078ప్రస్తుతం విక్రమ్ ఇరుముగమ్ అనే సినిమా చేస్తున్నాడు. నిశ్చితార్థ వేడుక కోసం ఈ సినిమాకు వారం రోజులు సెలవులు ప్రకటించాడు. కేవలం వ్యక్తిగత స్థాయిలోనే ఈ ఫంక్షన్ ను నిర్వహించాలని విక్రమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు మాత్రమే ఉండేలా… ఇండస్ట్రీకి చెందిన అతికొద్ది మంది స్నేహితులు మాత్రమే వచ్చేలా నిశ్చితార్థాన్ని ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది పెళ్లిని మాత్రం గ్రాండ్ గా చేయాలనేది విక్రమ్ ఆలోచన.
First Published:  26 Jun 2016 10:01 PM GMT
Next Story