Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మానందం, రమ్యకృష్ణ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా...

బ్రహ్మానందం ఏదో ఒక సినిమాకు కాల్షీట్ ఇచ్చి ఉంటాడు. ఇక్కడే ఎక్కడో షూటింగ్ చేస్తూ ఉండొచ్చు. అటు బాహుబలి-2 షూటింగ్ మొదలైంది కాబట్టి రమ్యకృష్ణ ఆ పనిలో బిజీగా ఉండొచ్చు. అంతా ఇలానే అనుకుంటారు. కానీ ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. కమల్ హాసన్ సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషలలో […]

బ్రహ్మానందం, రమ్యకృష్ణ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా...
X
బ్రహ్మానందం ఏదో ఒక సినిమాకు కాల్షీట్ ఇచ్చి ఉంటాడు. ఇక్కడే ఎక్కడో షూటింగ్ చేస్తూ ఉండొచ్చు. అటు బాహుబలి-2 షూటింగ్ మొదలైంది కాబట్టి రమ్యకృష్ణ ఆ పనిలో బిజీగా ఉండొచ్చు. అంతా ఇలానే అనుకుంటారు. కానీ ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. కమల్ హాసన్ సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జోరుగా సాగుతుంది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్న టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, శివగామి రమ్యకృష్ణ ఇటీవలే అమెరికా వెళ్లి అక్కడ షూటింగ్ లో అడుగుపెట్టారట. ఇక తాజా సమాచారం ప్రకారం.. అమెరికాలో జరుగుతున్న ‘శభాష్ నాయుడు’ షూటింగ్ లో పాల్గొన్న బ్రహ్మానందం, రమ్యకృష్ణ ల పాత్ర చిత్రీకరణ ఇప్పటికే రెండు రోజుల షూటింగ్ లో చాలావరకు పూర్తయిందట. మిగిలిన కొంచెం పాత్ర చిత్రీకరణ పూర్తయిన వెంటనే బ్రహ్మానందం, రమ్యకృష్ణ లు తిరిగి ఇండియాకు వస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్ తో కూడా బిజీగా ఉన్న రమ్యకృష్ణ ‘శభాష్ నాయుడు’ సినిమాలో కమల్ భార్య పాత్రను పోషిస్తున్నారని సమాచారం. వీళ్ళ కుమార్తెగా కమల్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ సినిమా డిసెంబర్, 1న విడుదలకానుంది.
Click on Image to Read:
varma
First Published:  25 Jun 2016 9:24 PM GMT
Next Story