Telugu Global
NEWS

చిట్టెం, అజ‌య్‌ల‌పై వేటు వేస్తారా?

కాంగ్రెస్ నుంచి ఇటీవ‌ల పార్టీ మారిన ఎమ్మెల్యేలు చిట్టెం న‌ర‌సింహా రెడ్డి, పూవ్వాడ‌ అజ‌య్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత‌లు గీతారెడ్డి, సంప‌త్‌కుమార్ త‌దిత‌రులు స్పీక‌ర్‌ను కోరారు. ఒక‌పార్టీ నుంచి గెలిచి.. మ‌రో పార్టీ లో చేరిన ఆ ఇద్ద‌రిపై త‌ప్ప‌కుండా అన‌ర్హ‌త వేటు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం మీడియాతో  మాట్లాడారు. ఒక‌పార్టీలో గెలిచి మ‌రోపార్టీలో  చేర‌డం అనైతిక‌మ‌న్నారు. ఇలాంటి నేత‌ల‌ను అధికార‌పార్టీ ప్రోత్స‌హించ‌డం మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. రెండేళ్ల‌లో దాదాపు 47 […]

కాంగ్రెస్ నుంచి ఇటీవ‌ల పార్టీ మారిన ఎమ్మెల్యేలు చిట్టెం న‌ర‌సింహా రెడ్డి, పూవ్వాడ‌ అజ‌య్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత‌లు గీతారెడ్డి, సంప‌త్‌కుమార్ త‌దిత‌రులు స్పీక‌ర్‌ను కోరారు. ఒక‌పార్టీ నుంచి గెలిచి.. మ‌రో పార్టీ లో చేరిన ఆ ఇద్ద‌రిపై త‌ప్ప‌కుండా అన‌ర్హ‌త వేటు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఒక‌పార్టీలో గెలిచి మ‌రోపార్టీలో చేర‌డం అనైతిక‌మ‌న్నారు. ఇలాంటి నేత‌ల‌ను అధికార‌పార్టీ ప్రోత్స‌హించ‌డం మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. రెండేళ్ల‌లో దాదాపు 47 మంది ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకున్న టీఆర్ ఎస్ తీరును తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. ఇలాంటి ప‌నుల‌తో టీఆర్ ఎస్ ప్ర‌పంచ రికార్డు సృష్టించింద‌ని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే భాస్క‌ర రావుపై మాత్రం ఈ బృందం ఫిర్యాదు చేయ‌లేదు. అత‌ను పార్టీ మారాడాని రుజువు చేసేందుకు త‌గిన ఆధారాలు, ప‌త్రాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధం చేయ‌లేదు. అందుకే భాస్క‌ర రావుపై ఫిర్యాదు చేయ‌డాన్ని వాయిదా వేశారు. త్వ‌ర‌లోనే ఆయ‌న‌పైనా మ‌రోసారి ఫిర్యాదు చేస్తార‌ని స‌మాచారం. గ‌తంలో స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌పై వేటు వేయాల‌ని కాంగ్రెస్‌.. టీడీపీలు పెద్ద ఉద్య‌మాన్నే న‌డిపాయి. కానీ, చివ‌రికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా క‌లిసి వెళ్లి వారిపార్టీని టీఆర్ ఎస్‌లో విలీనం చేశారు. దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.
అధికార పార్టీలోకి మ‌రిన్ని వ‌ల‌స‌లు ఉంటాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. టీడీపీ విష‌యంలో వేసిన ఎత్తుగ‌డ‌నే కాంగ్రెస్ విష‌యంలోనూ వేస్తార‌ని భావించ‌డ‌మే ఇందుకు కార‌ణం.కాంగ్రెస్ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 25 మంది. తాజాగా కాంగ్రెస్ నుంచి కారెక్కిన వారి సంఖ్య 8 దాటింది. వీరికి మ‌రికొంద‌రు తోడైతే.. మూడొంతుల మంది కారెక్కిన వార‌వుతారు. ఈ పార్టీ అసెంబ్లీ శాఖ‌ను కూడా అధికార పార్టీలో విలీనం చేయ‌ర‌న్న గ్యారెంటీ ఏంట‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న. ఇందుకు అవ‌కాశం లేక‌పోలేదు. వీరంద‌రిపై అందిన ఫిర్యాదుల‌ను స్పీక‌ర్‌ ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకునేలోప‌ల మూడొంతుల మంది కాంగ్రెస్‌ను వీడితే.. ఆ ప‌రిణామం జ‌రిగేందుకు అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నావేస్తున్నారు.
First Published:  24 Jun 2016 10:36 PM GMT
Next Story