Telugu Global
Cinema & Entertainment

మెగా హీరోయిన్ పై కన్నేసిన సూపర్ స్టార్ అల్లుడు

మెగా హీరోయిన్ అనగానే ఎవరికైనా నిహారిక గుర్తొస్తుంది. ఒక మనసు సినిమాతో ఈ వీకెండ్ లో సందడి చేయబోతోంది నిహారిక. ఈ సినిమా తర్వాత ఆమె ఎలాంటి సినిమాలో కనిపించనుందనే చర్చ కూడా సాగుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. నిహారికపై సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది. కుదిరితే తన నెక్ట్స్ సినిమాలో నిహారికను హీరోయిన్ గా తీసుకోవాలని ధనుష్ భావిస్తున్నాడట. ఒక మనసు సినిమాను చూసేందుకు ఇప్పటికే […]

మెగా హీరోయిన్ పై కన్నేసిన సూపర్ స్టార్ అల్లుడు
X

మెగా హీరోయిన్ అనగానే ఎవరికైనా నిహారిక గుర్తొస్తుంది. ఒక మనసు సినిమాతో ఈ వీకెండ్ లో సందడి చేయబోతోంది నిహారిక. ఈ సినిమా తర్వాత ఆమె ఎలాంటి సినిమాలో కనిపించనుందనే చర్చ కూడా సాగుతోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. నిహారికపై సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది. కుదిరితే తన నెక్ట్స్ సినిమాలో నిహారికను హీరోయిన్ గా తీసుకోవాలని ధనుష్ భావిస్తున్నాడట.

ఒక మనసు సినిమాను చూసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్న ధనుష్, చెన్నైలోని ఓ మల్టీఫ్లెక్స్ లో రిలీజ్ రోజునే ఒక మనసు సినిమాను చూడబోతున్నాడట. ఇంతకూ ధనుష్ ఈ సినిమాపై మనసుపడ్డానికి కారణం నిహారిక కాదట.. హీరో క్యారక్టరైజేషన్ నచ్చడమేనని కోలీవుడ్ టాక్. ఒక మనసు సినిమాలో హీరో నాగశౌర్య పోషించిన పాత్ర చిన్నచిన్న సెటిల్మెంట్స్ చేస్తూ, హుందాగా ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఒక మెడికో అయిన హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఈ హీరో క్యారెక్టర్ ధనుష్ కు విపరీతంగా నచ్చేసిందట. అందుకే సినిమా చూశాక, నచ్చితే వెంటనే తమిళ్ లో రీమేక్ చేయడానికి ధనుష్ రెడీగా ఉన్నాడని సమాచారం. అదే కనుక జరిగితే… తమిళ వెర్షన్ కు కూడా నిహారికనే తీసుకుంటాడట. అది మేటర్.

click on image to read:

chiru-150-movie

First Published:  23 Jun 2016 3:28 AM GMT
Next Story