Telugu Global
Cinema & Entertainment

మెగాస్టార్ బ‌ద్ద‌లు కొట్టాడు..!

మెగాస్టార్ ఫ్యాన్స్  ఎంత‌గానో వెయిట్ చేస్తున్న శుభ‌దినం రానే వ‌చ్చింది.   149 చిత్రాలు చేసి   బ్రేక్ ఇచ్చి..పాలిటిక్స్ లో ఇన్వాల్స్ అయ్యి పోయి  దాదాపు9 సంవ‌త్స‌రాలు పాటు మేక‌ప్ కు దూరంగా వున్నారు.  అయితే  రాష్ట్రం విడిపోవ‌డం.  రాజకీయంగా   దూరంగా ఉండ‌టం. కావాల‌సినంత స‌మ‌యం దొర‌క‌డంతో..  చిరు  మ‌ళ్లీ బ్యాక్ టు సినిమాకు అన్న‌ట్లు  జెండా ఉపేశారు.  దీంతో క‌థ‌లు సిద్దం చేయ‌డం..  ద‌ర్శ‌కుడు రెడి అన‌డం..  ఇలా చాలా జ‌రిగింది.  ముందు పూరి జ‌గ‌న్నాధ్ అన్నారు. క‌ట్ […]

మెగాస్టార్ బ‌ద్ద‌లు కొట్టాడు..!
X

మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంత‌గానో వెయిట్ చేస్తున్న శుభ‌దినం రానే వ‌చ్చింది. 149 చిత్రాలు చేసి బ్రేక్ ఇచ్చి..పాలిటిక్స్ లో ఇన్వాల్స్ అయ్యి పోయి దాదాపు9 సంవ‌త్స‌రాలు పాటు మేక‌ప్ కు దూరంగా వున్నారు. అయితే రాష్ట్రం విడిపోవ‌డం. రాజకీయంగా దూరంగా ఉండ‌టం. కావాల‌సినంత స‌మ‌యం దొర‌క‌డంతో.. చిరు మ‌ళ్లీ బ్యాక్ టు సినిమాకు అన్న‌ట్లు జెండా ఉపేశారు. దీంతో క‌థ‌లు సిద్దం చేయ‌డం.. ద‌ర్శ‌కుడు రెడి అన‌డం.. ఇలా చాలా జ‌రిగింది. ముందు పూరి జ‌గ‌న్నాధ్ అన్నారు. క‌ట్ చేస్తే ఫైన‌ల్ గా మెగాస్టార్ క‌త్తి సినిమా రీమేక్ తో వివి వినాయ‌క్ కే ఓటేశారు.

ఎట్ట‌కేల‌కు చిరు త‌న 150 వ చిత్రం తొలి రోజు షూటింగ్ జ‌రిగింది. అలితో స‌ర‌దా స‌న్నివేశం ఏదో షూట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. త‌మిళ్ లో విజ‌య్ హీరోగా.. ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ చేసిన చిత్రాన్ని తెలుగులో చిరు రీమేక్ చేస్తున్నారు. సందేశం తో పాటు.. ప్రేక్ష‌కుల్ని ఆలోచింప చేసే పాయింట్ కావ‌డంతో ప్ర‌యోగాలు చేయ‌డం ఇష్టం లేక .. సేఫ్ ప్రాజెక్ట్ గా ఉండేలా చూసిన‌ట్లు తెలుస్తుంది ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చిరు ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు క‌థ‌ను చెక్కి న‌ట్లు టాక్. మొత్తం మీద 150వ చిత్రం చిరు చేస్తాడో లేదో అనే సంశాయాని తొలిరోజు షూట్ తో బ‌ద్ద‌లు కొట్టాడ‌న్న‌మాట‌.

click on image to read:

danush-niharika

First Published:  23 Jun 2016 5:56 AM GMT
Next Story