Telugu Global
Cinema & Entertainment

రైతు గా మారిన హృతిక్ రోష‌న్...! 

భారీ  త‌నంతో  సినిమాలు చేయ‌డంలో  ద‌ర్శ‌కుడు అశుతోష్ గోవ‌రిక‌ర్  ఒక‌రు.  ల‌గాన్ ,  జోథా అక్బ‌ర్  చిత్రాలు చేసి  మెప్పించిన  అశుతోష్.. తాజాగా హృతిక్ రోష‌న్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో మొహెంజొ దారో  చిత్రం చేస్తున్నారు. ఈసినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో విశేష స్పంద‌న వ‌స్తుంది. మొహెంజొ దారో సంస్కృతిని, సంప్ర‌దాయాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టే.. ప్ర‌య‌త్నంలో అశుతోష్ వందశాతం.. విజ‌యం సాధిస్తార‌ని బాలీవుడ్  క్రిటిక్స్  అభిప్రాయ ప‌డుతున్నారు.    […]

రైతు గా మారిన హృతిక్ రోష‌న్...! 
X
భారీ త‌నంతో సినిమాలు చేయ‌డంలో ద‌ర్శ‌కుడు అశుతోష్ గోవ‌రిక‌ర్ ఒక‌రు. ల‌గాన్ , జోథా అక్బ‌ర్ చిత్రాలు చేసి మెప్పించిన అశుతోష్.. తాజాగా హృతిక్ రోష‌న్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో మొహెంజొ దారో చిత్రం చేస్తున్నారు. ఈసినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో విశేష స్పంద‌న వ‌స్తుంది. మొహెంజొ దారో సంస్కృతిని, సంప్ర‌దాయాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టే.. ప్ర‌య‌త్నంలో అశుతోష్ వందశాతం.. విజ‌యం సాధిస్తార‌ని బాలీవుడ్ క్రిటిక్స్ అభిప్రాయ ప‌డుతున్నారు.
ఈ చిత్రంలో హృతిక్ రోష‌న్ ఒక రైతు రోల్ చేస్తున్నారు. స‌ర్మ‌న్ మొహెంజోదారోలో జ‌రుగుతున్న అన్నాయాలపై ఎదురు తిరుగుతాడు. ఈ క్ర‌మంలోనే చానీ నఏ అందాల న‌ర్తికి ప‌రిచ‌య‌మ‌వుతుంది. దుర్మార్గుల చెర నుంచి మొహంజ‌దారోను ర‌క్షించ‌డానికి ఆ రైతు సాగించిన పోరాట‌మే మొహంజ దారో. ఆగ‌స్టు 12 న రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తున్నారు.
First Published:  22 Jun 2016 12:39 AM GMT
Next Story