Telugu Global
Cinema & Entertainment

పవన్ సినిమా నుంచి దర్శకుడు ఔట్

అవును.. ఇది నిజంగా నిజం. వరుసగా రెండోసారి పవన్ సినిమాలకే ఇలా జరుగుతోంది. మొన్నటికి మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ ప్రాజెక్టు నుంచి సంపత్ నంది తప్పుకున్నాడు. ఇప్పుడు పవన్ కొత్త సినిమా నుంచి ఎస్ జే సూర్య తప్పుకున్నాడు. ఫ్యాన్స్ అందరినీ షాక్ కు గురిచేసిన వార్త ఇది. ఈ వార్త దాదాపు నిజమే అన్నట్టు నిర్మాత శరత్ మరార్ సంకేతాలు పంపించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అయిన వెంటనే ఎస్ జే […]

పవన్ సినిమా నుంచి దర్శకుడు ఔట్
X
అవును.. ఇది నిజంగా నిజం. వరుసగా రెండోసారి పవన్ సినిమాలకే ఇలా జరుగుతోంది. మొన్నటికి మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ ప్రాజెక్టు నుంచి సంపత్ నంది తప్పుకున్నాడు. ఇప్పుడు పవన్ కొత్త సినిమా నుంచి ఎస్ జే సూర్య తప్పుకున్నాడు. ఫ్యాన్స్ అందరినీ షాక్ కు గురిచేసిన వార్త ఇది. ఈ వార్త దాదాపు నిజమే అన్నట్టు నిర్మాత శరత్ మరార్ సంకేతాలు పంపించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అయిన వెంటనే ఎస్ జే సూర్యతో కలిసి కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు పవన్. ఎస్ జే సూర్యతో కలిసి కథ, స్క్రీన్ ప్లే కూడా కంప్లీట్ చేశాడు. కానీ ఇంతలోనే ఆ ప్రాజెక్టు నుంచి ఎస్ జే సూర్య తప్పుకున్నాడట. వెంటనే ఎస్ జే సూర్య స్థానాన్ని డాలీతో భర్తీ చేశారట. గతంలో పవన్ హీరోగా నటించిన గోపాల గోపాల సినిమాకు డాలీనే దర్శకత్వం వహించాడు. డైరక్షన్ కంటే నటనపైనే ఎస్ జే సూర్య ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. తాజాగా తమిళ్ లో ఎస్ జే సూర్య చేసిన ఓ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఆఫర్లు బాగా వస్తున్నాయి. ఇటు తెలుగులో కూడా మహేష్ – మురుగుదాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందుకే దర్శకత్వం ఛాన్స్ ను వదులుకున్నట్టు చెబుతున్నారు.
Click on Image to Read:
chiru 150 movie
First Published:  19 Jun 2016 10:00 AM GMT
Next Story