Telugu Global
Cinema & Entertainment

ఇక విల‌న్ గా కొబ్బిరికాయ కొట్టాల్సిందే..?

హీరోగా  రాజ‌శేఖ‌ర్ చిత్రాలు న‌డ‌వ‌డం లేదు. ఇది నిజం. ఈ విష‌యం ఆయ‌న తెలుసుకునే స‌రికి చాల స‌మ‌యం ప‌ట్టింది.  న‌టుడిగా  ఎల్ల కాలం  హీరోగా కంటిన్యూ కావ‌డం అనేది జ‌ర‌గ‌దు. అంద‌రికి ఆ స్టార్ డ‌మ్… అభిమాన ద‌ళాలు  హీరోలంద‌రికి లేవు.  రాజ‌శేఖ‌ర్  త‌నను హీరోగా   అభిమానులు రిసీవ్ చేసుకోవ‌డం లేద‌నే విష‌యం  చాలా ఆలస్యంగా  గ్ర‌హించారు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న ప్ర‌తి నాయ‌కుడి రోల్స్ చేయ‌డానికి సిద్దమ‌ని ఈ మ‌ధ్య  ప్ర‌క‌టించారు. కానీ.. ఇంత వ‌ర‌కు […]

ఇక విల‌న్ గా కొబ్బిరికాయ కొట్టాల్సిందే..?
X
హీరోగా రాజ‌శేఖ‌ర్ చిత్రాలు న‌డ‌వ‌డం లేదు. ఇది నిజం. ఈ విష‌యం ఆయ‌న తెలుసుకునే స‌రికి చాల స‌మ‌యం ప‌ట్టింది. న‌టుడిగా ఎల్ల కాలం హీరోగా కంటిన్యూ కావ‌డం అనేది జ‌ర‌గ‌దు. అంద‌రికి ఆ స్టార్ డ‌మ్… అభిమాన ద‌ళాలు హీరోలంద‌రికి లేవు. రాజ‌శేఖ‌ర్ త‌నను హీరోగా అభిమానులు రిసీవ్ చేసుకోవ‌డం లేద‌నే విష‌యం చాలా ఆలస్యంగా గ్ర‌హించారు.
ఎట్ట‌కేల‌కు ఆయ‌న ప్ర‌తి నాయ‌కుడి రోల్స్ చేయ‌డానికి సిద్దమ‌ని ఈ మ‌ధ్య ప్ర‌క‌టించారు. కానీ.. ఇంత వ‌ర‌కు ఆయ‌న విల‌న్ గా ఏ చిత్రం ప‌ట్టాలేక్క లేదు. గతంలో హీరో గోపిచంద్ తో ల‌క్ష్యం, లౌక్యం, చిత్రాలు చేసిన ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ ముచ్చ‌ట‌గా మూడో చిత్రం చేయ‌డానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ విల‌న్ గా క‌నిపించే చాన్స్ వుంద‌ని టాక్. ప్ర‌స్తుతం గోపిచంద్ ఆక్సిజ‌న్ చిత్రం చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు యాంగ్రి యంగ్ మెన్ గా మెప్పించిన రాజ‌శేఖ‌ర్.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో్ ఏ మేర‌కు మెప్పిస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.
First Published:  17 Jun 2016 11:17 PM GMT
Next Story