Telugu Global
NEWS

మళ్లీ తలబడ్డ ఎంపీ జేసీ, ఎమ్మెల్యే ప్రభాకర్... ఒక పక్షం నిలబడ్డ టీడీపీ సభ్యులు

అనంతపురం నగరంలో పట్టుకోసం టీడీపీ ఎంపీ జేసీ, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో తరుచూ రెండు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నగరంలోని రామ్‌నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణం తాజా వివాదానికి కారణమైంది. ఫ్లైఓవర్ నిర్మాణానికి కొన్ని మున్సిపల్ దుకాణాలను […]

మళ్లీ తలబడ్డ ఎంపీ జేసీ, ఎమ్మెల్యే ప్రభాకర్... ఒక పక్షం నిలబడ్డ టీడీపీ సభ్యులు
X

అనంతపురం నగరంలో పట్టుకోసం టీడీపీ ఎంపీ జేసీ, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో తరుచూ రెండు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నగరంలోని రామ్‌నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణం తాజా వివాదానికి కారణమైంది. ఫ్లైఓవర్ నిర్మాణానికి కొన్ని మున్సిపల్ దుకాణాలను తొలగించాల్సి ఉంది. అయితే వాటిని తొలగించకుండా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం ఉంది.

ఈ విషయాన్ని జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తావించారు. ప్లైఓవర్ నిర్మాణం జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనికి ప్రభాకర్ చౌదరి అభ్యంతరం చెప్పారు. ఫ్లైఓవర్ నిర్మాణం తమకూ ఇష్టమేనని అయితే అందరికీ న్యాయం చేశాకే ముందుకెళ్లాలని చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఒక దశలో టీడీపీ సభ్యులంతా ప్రభాకర్‌ చౌదరి వైపు వచ్చి నిలబడ్డారు. కొందరు మహిళా కార్పొరేటర్లు జేసీతో వాగ్వాదానికి దిగేందుకు ప్రయత్నించగా ఆయన వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

రాంనగర్‌ ఫ్లైఓవరే కాకుండా పాతూరులో రోడ్ల విస్తరణ అంశంలోనూ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదం నడుస్తోంది. అనంతపురం నగరంలోకి ఎంటరయ్యే చోట అత్యంత ఇరుకుగా రోడ్డు ఉంది. ఒక బస్సు వెళ్తే పక్కన మోటర్ సైకిళ్లు వెళ్లేందుకు కూడా వీలుండదు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి రోడ్డు వెడల్పు కోసం రూ. 80 కోట్లు మంజూరు చేయించారు. కానీ రోడ్ల విస్తరణ జరగకుండా స్థానికులను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పనులు అడ్డుకున్నారని చెబుతుంటారు. దీంతో బయట నుంచి నగరంలోకి వచ్చే కొత్తవారు సదరు ఇరుకు దారిని చూసి ఇంత దారుణంగా అనంతలో పరిస్థితి ఉంటుందా అని ఆశ్చర్యపోతుంటారు. జేసీ మాత్రం స్థానికులు సహకరిస్తే తాడిపత్రి తరహాలో అనంతపురం రోడ్లను విస్తరించి చూపిస్తానంటున్నారు.

మరో విషయం ఏమిటంటే ఎన్నికల సమయంలో ప్రభాకర్‌ చౌదరికి జేసీ ఫండింగ్ కూడా చేశారని చెబుతుంటారు. కానీ ఎన్నికల తర్వాత జేసీ వ్యతిరేకుల జాబితాలో ప్రభాకర్ చౌదరి చేరిపోయారు. మొత్తం మీద సుధీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి అనివార్యపరిస్థితిలో టీడీపీలో చేరిన జేసీ ఇప్పుడు సొంతపార్టీలోనే పోరాటం చేస్తున్నారు.

Click on Image to Read:

wife-change

c-ramachandraiah

lokesh-yanamala

chandrababu-naidu

amarnath-reddy

r-krishnaiah-chandrababu-na

manikyala-rao

gutta-sukender-reddy

bhuma-nagi-reddy

C-Narasimha-Rao

rammurty-naidu-chandrababu-

revanth-reddy

anam-ramanarayana-reddy

kommineni-amar

buggana-rajendranath-reddy-

vastu-tax

jc-diwakar-reddy

laxmi parvathi

devineni

kotamreddy-sridhar-reddy

gottipati

First Published:  16 Jun 2016 4:54 AM GMT
Next Story