Telugu Global
NEWS

జగన్‌పై ఫిరాయింపుదారుల ఫైర్... భూమా సీమను,జ్యోతుల కాపులను మరిచారా?

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, భూమా నాగిరెడ్డి, డేవిడ్ రాజులు జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఎప్పటిలాగా జగన్‌ను తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా విమర్శించారు. జగన్ లాంటి అహంభావి దేశంలోనే లేరని చెప్పారు. తాను కాపు నాయకుడిని అని చెప్పుకునే జ్యోతుల నెహ్రు… ముద్రగడ దీక్షతో రగిలిపోతున్నకాపుల గురించి మాట్లాడడం మానేసి జగన్‌కు లేఖ రాయడం కూడా ఆసక్తికరంగానే ఉంది. జగన్‌కు రాసిన లేఖలో రెండేళ్లుగా ప్రతిపక్షనాయకుడు విధ్వంసక పాత్ర పోషిస్తున్నారని ముగ్గురు ఫిరాయింపుదారులు […]

జగన్‌పై ఫిరాయింపుదారుల ఫైర్... భూమా సీమను,జ్యోతుల కాపులను మరిచారా?
X

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, భూమా నాగిరెడ్డి, డేవిడ్ రాజులు జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఎప్పటిలాగా జగన్‌ను తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా విమర్శించారు. జగన్ లాంటి అహంభావి దేశంలోనే లేరని చెప్పారు. తాను కాపు నాయకుడిని అని చెప్పుకునే జ్యోతుల నెహ్రు… ముద్రగడ దీక్షతో రగిలిపోతున్నకాపుల గురించి మాట్లాడడం మానేసి జగన్‌కు లేఖ రాయడం కూడా ఆసక్తికరంగానే ఉంది. జగన్‌కు రాసిన లేఖలో రెండేళ్లుగా ప్రతిపక్షనాయకుడు విధ్వంసక పాత్ర పోషిస్తున్నారని ముగ్గురు ఫిరాయింపుదారులు ఆరోపించారు.

రాజధాని ప్రాంతంలో రైతుల పంటలు తగలబెట్టించింది జగనేనని ఆరోపించారు. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటే పెట్టుబడులు పెట్టవద్దు అంటూ జగన్ లేఖలు రాశారని ఆరోపించారు. రెండేళ్ల తర్వాత విజయవాడలో జగన్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని… ఈ రెండేళ్లు ఎన్నడూ కూడా జగన్ ప్రతిపక్షనాయకుడిగా వ్యవహరించలేదని విమర్శించారు. సీఎం పదవి దక్కలేదన్న కోపంతోనే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ ఎన్ని కుప్పిగంతులు వేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలేదని పార్టీ ఫిరాయించి రాజీనామా చేయకుండా తిరుగుతున్న ముగ్గురు ఎమ్మెల్యేలు మండిపడ్డారు. పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు చంద్రబాబు అండగా నిలిచారని భూమా ప్రశంసించారు.

మొత్తం మీద ఈ లేఖ ద్వారా జగన్‌ వల్లే చంద్రబాబు ఏమీ చేయలేకపోతున్నారన్న సాకును చెప్పబోయారు. పట్టిసీమను చంద్రబాబు పూర్తి చేసి రాయలసీమకు అండగా నిలిచారని కర్నూలు జిల్లాకు చెందిన భూమానాగిరెడ్డి చెబుతున్నారు. కానీ పట్టిసీమ నుంచి రాయలసీమకు ఎక్కడ నీరు వచ్చయో ఆయనకే తెలియాలి. శ్రీశైలంలో నీటిమట్టం 780 అడుగులకు పడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు రాయలసీమకు అండగా నిలబడ్డారని భూమా చెబుతున్నారంటే ఈ ప్రాంత ప్రజలే ఆలోచన చేయాలి. రాజధానిలో పంటపొలాలను జగన్ తగలబెట్టించి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చుందో కూడా లేఖలో వివరించాల్సింది. జగన్‌ను జనం నమ్ముతారో లేదో గానీ… ముందు ఒక పార్టీపై గెలిచి మరోపార్టీలోకి దూరిపోయిన పెద్దమనుషులు ఎవరైనా, ఏ పార్టీ వారైనా రాజీనామా చేసి ఎన్నికల్లో తిరిగి గెలిచి మాట్లాడితే విలువ ఉంటుంది గానీ ఇలా ఎవరి ఆత్మసంతృప్తి కోసమో లేఖలు రాస్తే ఏమొస్తుంది?.

భూమాకు, జ్యోతుల నెహ్రూకు, జెలీల్ ఖాన్ కు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటికి నెరవేరుతుందో తెలియదుకానీ అప్పటిదాకా టీడీపీ పెద్దలు ఎలాంటి స్క్రిప్ట్ ఇచ్చినా దాని ప్రకారం నటించాల్సిన గత్యంతరంలేని పరిస్థితి వీళ్లది. లేకపోతే మంత్రి పదవి రాదేమోనన్న భయం. ఇవే మంత్రి పదవులకోసం ఎప్పటినుంచో టీడీపీలో ఉంటూ ఎదురుచూస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి, బోండా తదితరులను మించి ఆవేశపడుతున్నారు వీళ్లు. ఈ ఆవేశం వీళ్లకు చంద్రబాబు దగ్గర, చినబాబు దగ్గర ఎప్పటికి మేలు చేస్తుందో కానీ ఈలోగా వీళ్లను గెలిపించిన ప్రజలు వీళ్ల గురించి ఏమనుకుంటున్నారో కూడా ఒకసారి తెలుసుకుంటే మంచిది.

Click on Image to Read:

dasari-narayana-rao

kapu-leaders-meeting-in-par

somireddy

V-Hanumantha-Rao-1

anam-ramanarayana-reddy

trivikaram

t-congress

jc-diwakar-reddy

mudragada-son

anna-canteens

pawan-joker

balakrishna

First Published:  13 Jun 2016 9:58 PM GMT
Next Story